Moviesవిజ‌య‌శాంతి, మాధ‌వీల‌త స‌ర‌స‌న స‌మంత‌... సంచ‌ల‌న నిర్ణ‌యం...!

విజ‌య‌శాంతి, మాధ‌వీల‌త స‌ర‌స‌న స‌మంత‌… సంచ‌ల‌న నిర్ణ‌యం…!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల వరుసగా సంచల నిర్ణయాలు తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. గ‌త రెండేళ్ల కాలంలో విడాకుల నుంచి సినిమాల్లో రీ ఎంట్రీ, ఐటెం సాంగ్‌లు ఇలా వ‌రుస‌గా ఎవ్వ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యాలే తీసుకుంటూ వ‌స్తోంది. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సమంత పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుందట. ఇప్పటికే అక్కినేని కుర్రాడు నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత తన సినీ కెరీపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం అటు బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.

తెలుగులో ఇప్పటికే ఆమె చేతిలో థ్రిల్ల‌ర్ మూవీ యశోద – గుణశేఖర్ శాకుంత‌లంతో పాటు విజయ్ దేవరకొండకు జోడిగా నటిస్తున్న ఖుషి సినిమాలు ఉన్నాయి. అటు బాలీవుడ్ లోనూ ఒకటి రెండు వెబ్ సిరీస్ లతో పాటు మరో సినిమాలో కూడా సమంత నటిస్తోంది. గత కొంతకాలంగా సమంత పొలిటికల్ గా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేనేత వస్త్రాలకు సమంత ప్రచారకర్తగా మారి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు స‌మంత క్రియాశీల రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్లానింగ్ చేసుకుంటోంద‌ట‌. సామ్ ఇటు సినిమాల్లో న‌టిస్తూనే అటు బీజేపీలో చేర‌బోతున్నార‌న్న వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. గ‌తంలోనే సామ్ తాను ప్ర‌ధాన‌మంత్రి మోడీకి గ‌ట్టి స‌పోర్ట‌ర్‌ను అని బాహాటంగానే చెప్పుకుంది. అయితే ఇప్పుడు ఆమె సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని… బీజేపీ కండువా క‌ప్పుకోనుంద‌ని అంటున్నారు.

 

టాలీవుడ్ నుంచి ఇప్ప‌టికే రేష్మీ రాథోడ్‌, సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి, మ‌రో న‌టి జీవిత‌తో పాటు మాధ‌వీల‌త లాంటి వాళ్లు బీజేపీలో ఉన్నారు. అటు కోలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టిమ‌ణి ఖుష్బూ సైతం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఇక ఇప్పుడు స‌మంత కూడా వీరి స‌ర‌స‌న చేర‌బోతోన్న‌ట్టే తాజా వార్త‌లు క‌న్‌పార్మ్ చేస్తున్నాయి.

ఇక ఇటీవ‌ల బీజేపీ సినీ న‌టుల‌పై బాగా ఫోక‌స్ చేస్తోంది. స్టార్ హీరో ఎన్టీఆర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను క‌ల‌వ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇక ఇప్పుడు స‌మంత కూడా కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌ను ముందుగా క‌లిశాకే త‌ర్వాత ఆ పార్టీలో చేరుతుంద‌ని అంటున్నారు. ఏదేమైనా స‌మంత సంచ‌ల‌నాల ప‌రంప‌ర‌లో ఇది మ‌రో సంచ‌లనం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news