Moviesఅందరి ముందే కాళ్లు పైకి ఎత్తి..అలా..విజయ్ దేవరకొండ కి ఇంత తల...

అందరి ముందే కాళ్లు పైకి ఎత్తి..అలా..విజయ్ దేవరకొండ కి ఇంత తల పొగరా..!?

విజయ్ దేవరకొండ..ఈ పేరు కి ఇప్పుడు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు సినిమా తో క్లాసిక్ హిట్ అందుకున్న ఈ హీరో..అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం తన తల రాతను తానే మార్చేసుకున్నాడు. ఆ సినిమా లో విజయ్ ని అర్జున్ పాత్రలో చూసిన ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే..ఆ యాటిట్యూడ్..ఆ తల పొగరు.. ఆ కోపం..అబ్బో, అప్పట్లో జనాలకు పిచ్చి పిచ్చిగా..పిచ్చేక్కేలా చేసింది. ఓ ఊపు ఊపేసింది.

అయితే, ఆ యాటిట్యూడ్ సినిమా ల వరకు ఉంటే బాగుంటుంది. కానీ నిజ జీవితంలో కూడా అలానే బీహేవ్ చేస్తే చాలా చెత్తగా ఉంటుంది..ఎదుటి వాళ్లకి కోపం తెప్పిస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. ఈ యంగ్ హీరో సరికొత్త లుక్ లో కనిపించిన సినిమా లైగర్. పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరి కొద్ది రోజులోనే జనాల ముందుకు రాబోతుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుండటంతో..ప్రమోషన్స్ పనులను చక చకా కానిచ్చేస్తున్నారు లైగర్ టీం.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. అంతా బాగానే ఉన్నా..కానీ, అక్కడ విజయ్ దేవరకొండ ప్రవర్తించిన్ అతీరు మాత్రం బాగోలేదు. ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కూర్చున్న విధానం హాట్ టాపిక్ అయ్యింది. అతడు ఎదురుగా ఉన్న టేబుల్ పై రెండు కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం అక్కడకు వచ్చిన జనాలకు నచ్చలేదు. దీంతో ఈ ఇష్యూ వివాదాస్పదమైంది. దీని గురించి ఓ విలేకరి కూడా అడగడం జరిగింది. దానికి ఆయన ఆన్సర్ వింటే..షాక్ అవ్వాల్సిందే. “మీరు కూడా హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చొని ప్రశ్నలు అడగవచ్చు”..అంటూ విజయ్ దేవరకొండ సచెప్పుకొచ్చాదు. దీంతో విజయ్ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news