Moviesటాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ చేతిలో బందీ అయిన యంగ్ హీరోయిన్‌.. అస్స‌లు...

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ చేతిలో బందీ అయిన యంగ్ హీరోయిన్‌.. అస్స‌లు వ‌ద‌ల‌ట్లేదుగా…!

సినిమా రంగంలో కొత్త హీరో, హీరోయిన్ డైరెక్టర్ల‌ను పరిచయం చేసినప్పుడు వాళ్లలో టాలెంట్ ఉంది అనుకుంటే వెంటనే నిర్మాతలు లేదా దర్శకులు లాక్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అయినప్పుడు అనిల్ పై నమ్మకంతో కళ్యాణ్ రామ్ వెంటనే మరో రెండు సినిమాలు కూడా తన బ్యానర్లోనే చేయాలని అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అగ్ర నిర్మాత దిల్ రాజు కళ్యాణ్ రామ్‌ను ఒప్పించి అనిల్ రావిపూడిని తన బ్యానర్ లోకి తీసుకువెళ్లాడు. అలా అనిల్ రావిపూడి రెండు, మూడు సినిమాలు కళ్యాణ్‌రామ్‌కు చేయాల్సి ఉన్న దిల్ రాజుకు చేశాడు.

ఇక ఇందుకు సంబంధించి వాళ్ళ మధ్య అగ్రిమెంట్లు కూడా ఉంటాయి. అయితే ఈ అగ్రిమెంట్ తప్పిన వారు పెనాల్టీ కూడా చెల్లించేలా అందులో రాసుకుంటారు. ఇలా అగ్రిమెంట్ చేసిన వారి కెరీర్ కి ఇది ఒక్కోసారి ప్లస్ అవుతుంది.. మరోసారి మైనస్ కూడా అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ ఇలా ప్రామిసింగ్ చేసి ఓ డైరెక్టర్ చేతిలో బందీ అయిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. అక్కినేని అఖిల్ హీరోగా అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ఏజెంట్. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్.

తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. ఇప్పటికే ఆమె హాట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కొందరు దర్శక, నిర్మాతలు ఆమెను తమ సినిమాలలో తీసుకునేందుకు రెడీగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఏజెంట్ సినిమాకు ఆమెకు కేవలం 35 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇప్పుడు రెండో సినిమాకే ఆమెకు కోటి రూపాయలు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడే ఆమెను దురదృష్టం వెంటాడుతోంది.

ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెను బ్లాక్ చేశారు. ఏజెంట్ విడుదల అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని… అలాగే రెండో సినిమా కూడా తనకే చేయాలని… ఆయన ఏదో అగ్రిమెంట్ రాసుకున్నారట సాక్షి వైద్యతో..! అయితే ఇప్పుడు బయట బ్యానర్ల నుంచి కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్లు వస్తున్నా ఆమె ఈ అగ్రిమెంట్‌ దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం ఆమెకు పెద్ద బ్యానర్లు.. పెద్ద దర్శకుల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news