Moviesవావ్: 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్ తో..జాక్ పాట్...

వావ్: 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్ తో..జాక్ పాట్ కొట్టిన వేణు తొట్టెంపూడి..!?

వేణు తొట్టెంపూడి.. ఈ హీరో గురించి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో జనాలను కడుపుబ్బ నవ్వించిన ఈ హీరో .. ఇప్పుడు మళ్లీ తన సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసాడు. అప్పట్లో వేణు నటించిన అన్ని సినిమాలు ఆల్ మోస్ట్ ఆల్ అన్ని మంచి పాజిటివ్ టాక్ అందుకున్నావే. చిరునవ్వు, కళ్యాణ రాముడు,చెప్పవే చిరుగాలి, సినిమాలు అయితే..ఇప్పటికి టీవీలో వస్తే ఆ సినిమాలను చూసి ఏంజాయ్ చేస్తాం. నవ్వుకుంటాం.

ఎందుకో తెలియదు కానీ నటన బాగా చేస్తున్నా ఆయనకు అవకాశాలు తగ్గాయి. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైయాడు ఈ హీరో. ఆ తరువాత మళ్ళీ మంచి పాత్రలు రావడంతో.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేశాడు. సినిమా ఫ్లాప్ అయినా..ఆయన పాత్రకు మాత్రం మంచి పేరే దక్కింది. దీంతో ఆయనకు మళ్ళీ అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో బిగ్ ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో మహేశ్ కు అన్నగా వేణు ని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో వేణుని సంప్రదించిన్నట్లు సమాచారం. గతంలో వేణు చేసిన కొన్ని సినిమాలకి త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. ఒక్కవేళ ఈ సినిమాకి ఒప్పుకుంటే..దాదాపు 22 ఏళ్ళ తరువాత క్రేజీ కాంబో సెట్ అయ్యిన్నట్లే అని చెప్పవచ్చు. ఇప్పటికే త్రివిక్రమ్ వేణుని కలిసి కథ కూడా చెప్పాడని..వేణు కూడా ఓకే అన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news