Moviesరాధికా ఆఫ్టేతో మిస్ బిహేవ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో... గోళ్ల‌తో...

రాధికా ఆఫ్టేతో మిస్ బిహేవ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో… గోళ్ల‌తో గిల్లి మ‌రీ…!

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలకు చెందిన సినిమాలలో.. అందరి హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది నటి రాధిక ఆప్టే. ఏ పాత్రలో అయినా సింపుల్‌గా నటించడం… కథ నచ్చితే ఎలాంటి రోల్ అయినా చేయటం రాధిక స్పెషాలిటీ. రాధిక అప్పుడెప్పుడో 2012లోనే లండన్ కు చెందిన బెన‌డిక్ట్ టేల‌ర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన సినిమా కెరియర్ కు ఇబ్బందులు లేకుండా భర్తతో అండర్ స్టాండింగ్ తో ఉంటూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్లో ఓ స్టార్ హీరో నుంచి తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి రాధిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది.

అయితే ఆమె త‌న‌కు సినిమా తొలి రోజునే ఈ అనుభ‌వం ఎదురైంద‌ని చెప్ప‌డంతో పాటు పైగా స్టార్ హీరో అన‌డంతో ఆమె ఏ హీరోను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేసిందా ? అన్న చ‌ర్చ అప్ప‌ట్లో బాగా న‌డిచింది. ఆమె
పార్చ్‌డ్ – బజార్ – రక్తచరిత్ర – లెజెండ్ – ల‌య‌న్ సినిమాలు చేసింది. ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు ర‌క్త‌చ‌రిత్ర‌, లెజెండ్‌, ల‌య‌న్ సినిమాల‌తో బాగా ద‌గ్గ‌రైంది. బోల్డ్ పాత్ర‌లు, బోల్డ్ కామెంట్స్‌తో రాధిక ఎప్పుడూ కావాల్సినంత ర‌చ్చ క్రియేట్ చేస్తూనే ఉంటుంది.

ఆమె ఓ చిట్‌చాట్ షోలో ఓ టాలీవుడ్ టాప్ హీరో త‌న‌తో తొలి సినిమా చేస్తున్న‌ప్పుడే చాలా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని రాధిక చెప్పింది. మొద‌టి రోజే తాను అనారోగ్యంగా ఉన్నా కూడా ఓ సీన్ షూట్ చేయాల‌ని అనుకున్నారు. తాను బెడ్‌మీద ప‌డుకునే సీన్ షూట్ చేస్తున్నారు. ఆ టైంలో అక్క‌డ చాలా మంది ఉన్నారు. ఆ హీరో నా పాదాల‌ను గ‌ట్టిగా గిల్లాడు.. నేను బాధ‌తో విల‌విల్లాడాను అని చెప్పింది.

ఆ హీరో అలా చేయ‌డంతో తాను కోపంతో అరవ‌డంతో పాటు మ‌రోసారి ఇలా ప్ర‌వ‌ర్తించ‌కండ‌ని చెప్పాన‌ని రాధిక చెప్పింది. రాధిక చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆ హీరో ఎవ‌రు ? అన్న‌దానిపై పెద్ద డిస్క‌ర్ష‌నే న‌డిచింది.
అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగింది… ఆమె ఆ హీరోతో తొలి సినిమా చేస్తున్న‌ప్పుడు అని చెప్పింది.. ర‌క్త‌చ‌రిత్ర‌తో పాటు బాల‌య్య‌తో రెండు సినిమాలు చేసింది.

దీంతో రాధిక ఏ హీరోను ఉద్దేశించి అన్న‌దానిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేశారు. ఇక రాధిక కెరీర్ విష‌యానికి వ‌స్తే ఆమె చివరగా ఫోరెన్సిక్ లో కనిపించింది. ప్రస్తుతం విక్రమ్ వేదలో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె సైఫ్ అలీఖాన్ భార్య పాత్రను పోషిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news