Moviesరానా భార్య మిహికా గ్లామ‌ర్ షో చూశారా... హీరోయిన్ల‌ను మించిన అందం......

రానా భార్య మిహికా గ్లామ‌ర్ షో చూశారా… హీరోయిన్ల‌ను మించిన అందం… (ఫోటోలు)

టాలీవుడ్‌లో దగ్గుపాటి రానా ఒక ప్రత్యేకమైన నటుడు. దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు వారసుడిగా ఆయన రెండో కుమారుడు వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వెంకటేష్ తర్వాత దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసుడుగా సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా హీరో అయ్యాడు. రానా ముందు నుంచి తన కెరీర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. 10 ఏళ్ల క్రితమే దమ్ మారో ద‌మ్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో బిపాసాబ‌సుతో కలిసి రానా నటించాడు. ఆ తర్వాత కోలీవుడ్లో అజిత్ హీరోగా వచ్చిన ఆట ఆరంభం సినిమాలో కూడా నటించాడు.

భాషతో సంబంధం లేకుండా ఎలాంటి ఇగోలకు పోకుండా అన్ని భాషల్లోనూ.. అందరి హీరోలతోనూ కలిసి నటించటం రానా స్పెషాలిటీ. బాహుబలి సినిమాతో రానా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బల్లాళ‌దేవుడిగా రానా నటనకు యావత్ ఇండియన్ సినిమా ఫిదా అయిపోయింది. ఇదిలా ఉంటే రానా కరోనా లాక్ డౌన్ సమయంలో తన ప్రేయసి మిహికా బజాజ్ ని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యాడు. రానా సోషల్ మీడియాకు ఎప్పుడు దూరంగానే ఉంటూ వస్తున్నాడు.

అయితే రానా భార్య మిహికా బజాజ్ మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ క్రేజీ కపుల్స్ ఒక పెళ్లిలో సందడి చేశారు. డిజైనర్ కునాల్ – అర్పిత మెహతా వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇంతకు కునాల్ .. మిహికా బ‌జాజ్ మధ్య రిలేషన్ ఉంది. దీంతో రానా – మిహికా ఈ పెళ్లికి హాజరయ్యారు. రానా – మిహికా ఇద్దరూ గోధుమ రంగు డ్రెస్సుల్లో మెరిసిపోతూ.. ఆ పెళ్ళిలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు.

మిహికా అయితే లెహంగా ధరించి గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. అలాగే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ స్నేహితులతో పాటు బంధువులతో ఉన్న పిక్స్ కూడా మిహికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రానా అయితే ఏకంగా తలపాగా పెట్టుకొని చాలా దర్జాగా కనిపిస్తున్నాడు. ఇటు రానా పక్కన మిహికా అయితే అందానికే అందం అన్నట్టుగా గ్లామర్ లుక్ లో కవిస్తోంది.

ఏదేమైనా ఈ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. చాలా అందంగా ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రానా చివరగా విరాటపర్వం సినిమాలో నటించాడు. ప్రేమ.. నక్సలిజం లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రశంసలు అందుకున్నా… కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. ఇక రానా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news