Moviesపాపం.. అన‌న్య నాగ‌ళ్ల ప‌రిస్థితి ఇంత దారుణ‌మా... ప‌వ‌న్ కూడా హెల్ఫ్...

పాపం.. అన‌న్య నాగ‌ళ్ల ప‌రిస్థితి ఇంత దారుణ‌మా… ప‌వ‌న్ కూడా హెల్ఫ్ చేయ‌లేదే…!

టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిలకు కాలం కలిసి రావటం లేదు. అందంతో పాటు టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ కూడా అవకాశాలు రావడం లేదు. ఒకటి రెండు అవకాశాలు వచ్చినా చిన్న చిన్న హీరోలు.. చిన్న చిన్న పాత్రలు, మీడియం రేంజ్ సినిమాలకే పరిమితమై పోతున్నారు. అంజలి లాంటి హీరోయిన్ల‌కు, సీనియర్ హీరోల పక్కన మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. అక్కడితో అంజలి సరి పెట్టేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల‌ కూడా పలు సినిమాల్లో నటించింది.

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురు అమ్మాయిలలో ఒకరుగా కనిపించిన అనన్యకు మంచి పేరు వచ్చింది. ఈ పాత్రతో తాను టాలీవుడ్ లో మంచి బిజీ ఆర్టిస్టుగా మారతానని అనన్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప‌వ‌న్ సినిమాలో చేయ‌డంతో త‌న రేంజ్ మారిపోతుంద‌నే అనుకుంది. అయితే ఈ అమ్మడికి వకీల్ సాబ్ సినిమా వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ సినిమా విడుదల అయి ఇప్పటికే యేడాదిన్న‌ర దాటుతోంది. ఆ పాత్రకు మంచి పేరు వచ్చినా.. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం లేదు.

చివరకు అనన్య తాను లైన్ లో ఉన్నానని ప్రూవ్ చేసుకునేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. చిన్నాచితకా సినిమాల్లో మీడియం రేంజ్ హీరోల పక్కన నటించేందుకు కూడా రెడీగా ఉంది. ఎన్ని చేసినా ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరికి సోషల్ మీడియాలో వీలు కుదిరినప్పుడల్లా అందాల ఆరబోతతో పాటు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అట్రాక్షన్ తనవైపు ఉండేలా చూసుకుంటుంది. అప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.

చివరకు ఈ అమ్మడు తన పెదాలకు ఆపరేషన్ కూడా చేయించుకొని మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుందన్న పుకార్లు కూడా ఇటీవల కాలంలో షికారులు చేశాయి. అయినా కూడా అనన్య వైపు ఎవరు చూడటం లేదు. ఒకటి రెండు వెబ్ సిరీస్‌ల‌లో నటించేందుకు అవకాశం వచ్చినా అవి కూడా ఆమెకు ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేకపోయాయి. చివరకు చిన్న చిన్న సినిమాల్లో తాను నటించేందుకు అందాలు ఆరబోసేందుకు రెడీగా ఉన్నానని హాట్ హాట్ ఫోటో షూట్లతో సిగ్నల్స్ ఇస్తున్నా కూడా ఎవరు అమ్మడి వైపే చూడటం లేదు.

ఏదేమైనా అనన్యకు అందంతో పాటు టాలెంట్ ఉన్నా.. ఇటు తాను తెలుగు అమ్మాయిని అయినా గ్లామర్‌కు గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇస్తున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. పేరుకు మాత్రం ఆమె పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించినా ఆ సినిమాతో ఆమె కెరీర్‌కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news