Moviesబిగ్ షాకింగ్: డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్కైన టాలీవుడ్ స్టార్...

బిగ్ షాకింగ్: డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్కైన టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్..!?

డ్రగ్స్, డ్రగ్స్ మాఫియా, డ్రెస్ కేస్, డ్రగ్ డీలింగ్స్.. కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీని ఈ డ్రగ్స్ మ్యాటర్ సంచలనంగా మార్చేసింది. స్టార్ హీరో కాదు,, స్టార్ హీరోయిన్ కాదు ఎవరిని వదలకుండా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తుంది. మనకు తెలిసిందే కొందరు స్టార్ సన్స్, డాటర్స్, ఈ డ్రగ్స్ వలయంలో చిక్కుకుని వాళ్ల కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు. కేవలం సినీ ప్రముఖలే కాదు సామాన్యులు ..డబ్బున్న బిగ్ స్టార్స్ ..రాజకీయ నాయకుల కూతుర్లు.. అల్లుళ్లు,, కొడుకులు అందరూ కూడా ఈ డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు.

తల్లితండ్రులు అడిగినంత డబ్బు ఇవ్వడమే కాకుండా ..మితిమీరిన స్వేఛ్చ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. అయితే కొంతకాలంగా టాలీవుడ్ లో ఈ డృఅగ్స్ ఇష్యూ కొత్త ప్రకంపనులు సృష్టించిన సంగతి తెలిసిందే . బిగ్ స్టార్స్ కూడా ఈ కేసులో చిక్కుకొని కోర్టుకు హాజరై తాము ఏ తప్పు చేయలేదని ..తాము డ్రగ్స్ తీసుకోలేదని డ్రగ్ డీలర్స్ తో తాము ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయినా కానీ ఇంకా చాలామంది సెలబ్రిటీస్ కోర్టుకి హాజరవుతూనే ఉన్నారు. కాగా రీసెంట్ గా టాలీవుడ్ లో మళ్లీ డ్రగ్స్ ఇష్యూ కొత్త సమస్యలు తీసుకొచ్చింది.


రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్న ఓ కొరియోగ్రాఫర్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తుంది . ఈ అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ హీరో ల దగ్గర పని చేసినట్లు సమాచారం . అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న గోపికృష్ణ అనే వ్యక్తి గోవా నుండి ఎం డి ఎం ఏ డ్రగ్స్ తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల కళ్ళు కప్పి హైదరాబాదులో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు.

కాగా ఈయన డ్రగ్స్ అముతున్న లిస్టులో స్టార్ హీరోస్, డాటర్స్ ,స్టార్ సెలబ్రిటీస్,బడా పొలిటిషియన్స్,బడా బిగ్ స్టార్స్ పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించగా దాదాపు 80000 విలువైన 12 గ్రాముల ఎండిఎం ఏ డ్రగ్స్ ,హష్ ఆయిల్స్ ,మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కొత్త ప్రకంపనులు సృష్టించిన్నట్లైంది. గతంలో మన టాలీవుడ్ నుంచి డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ , ఛార్మీ, తరుణ్ లాంటి బిగ్ స్టార్స్ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news