Moviesఅనసూయ వివాదంలో ఫింగర్ పెట్టిన బన్ని బ్యూటీ..మ్యాటర్ టూ హాట్ గురూ..!?

అనసూయ వివాదంలో ఫింగర్ పెట్టిన బన్ని బ్యూటీ..మ్యాటర్ టూ హాట్ గురూ..!?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయనే కనిపిస్తుంది. దానికి కారణం మనకు తెలిసిందే. ఆగస్టు 25న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కి రిలీజ్ అయిన సినిమా లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో తోనే భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కారణాలు ఏవైనా కానీ అనసూయ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలకే సోషల్ మీడియాలో ఓ కాంట్రవర్షీయల్ పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ పరోక్షంగా లైగర్ సినిమా ఫ్లాప్ ను టార్గెట్ చేసిన్నత్లు ఉంది. పైగా దాని కారణంగా ఆమె సంబరపడుతున్నట్లే అనిపించింది . దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మండిపోయింది. తాము అభిమానించే హీరో ఫ్లాప్ ని ఎంజాయ్ చేస్తుందా..అంటూ ఆమె పై ట్రోలింగ్ స్టార్ట్ చేసారు. ముందుగానే అనసూయ అంటే పడని జనాలు చాలామంది ఉన్నారు . వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . ఆంటీ అంటూ కొందరు అమ్మమ్మ అంటూ మరికొందరు వామ్మో లైగర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనసూయకు చుక్కలు చూపిస్తున్నారు . అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా బెదరకుండా వాళ్లకి దిటైన సమాధానం ఇస్తూ వచ్చింది. అంతేనా ఏకంగా సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. దీంతో మ్యాటర్ మరింత హాట్ గా తయారైంది.

కాగా ఈ క్రమంలోనే అనసూయ కి సపోర్ట్ చేస్తూ హీరోయిన్ శ్రద్ధాదాస్ ఆమెకు సపోర్ట్ చేస్తూ ట్విట్ చేసింది. అంతకుముందు అనసూయ ట్విట్ చేస్తూ..” నేను ఎవరికీ ఆంటీని కాదు. 25 ఏళ్లు వచ్చి పిల్లలు కంటే ఆంటీలు అయిపోతారా ..?”అని అనసూయ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. హీరోయిన్ శ్రద్ధ అదిరిపోయే కామెంట్ చేశారు.” మీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే మీరు చాలా హాట్ గా ఉన్నారు . అనసూయ గారు మీ ఏజ్ కంటే డబుల్ ఏజ్ ఉన్న అంకుల్స్ కంటే కూడా మీరు హాట్ . అందుకే మీరంటే నాకు ఇష్టం “అంటూ శ్రద్ధాదాస్ కామెంట్ చేసింది. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రద్ధాదాస్ పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది . విజయ్ దేవరకొండ అభిమానులు పరోక్షంగా శ్రద్ధదాస్ ను టార్గెట్ చేశారు. ఆమె గతం తాలూక హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో శ్రద్ధా..” నేను ఎవరికీ భయపడను. నేను నెగిటివ్ కామెంట్స్ ను పట్టించుకోను . మీకే టైం వేస్ట్ . మహా అయితే బ్లాక్ చేస్తాను .ఒకరిని పొగిడినందుకు నన్ను తిట్టడంలో అర్థం లేదు” అంటూ మళ్ళీ ట్వీట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news