Moviesఎన్టీఆర్ - కొర‌టాల సినిమాకు ఆ క్యూట్ హీరోయిన్ ఫిక్స్‌...!

ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాకు ఆ క్యూట్ హీరోయిన్ ఫిక్స్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా తెరకెక్కించాలని కొరటాల శివ కసితో ఉన్నాడు. సినిమా రేంజ్ ను పెంచేందుకు స్టార్ కాస్టింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముందుగా బాలీవుడ్ నటి అలియాభ‌ట్‌ను ఎన్టీఆర్ కి జోడిగా నటింపజేయాలని కొరటాల విశ్వ ప్రయత్నాలు చేశారు.

ముందు ఈ సినిమాలో నటించేందుకు అలియా ఓకే చెప్పింది. ఆ తర్వాత బిజీ షెడ్యూల్ తో పాటు ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా ప్రకటన చేసింది. అలియా తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు ? అన్నదానపై కొద్ది రోజులుగా ఆసక్తి నెలకొంది. అలియా తప్పుకున్న తర్వాత సమంతను సంప్రదించారు. సమంతకు కూడా ఎన్టీఆర్ పక్కన నటించాలన్న కోరిక బలంగా ఉంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మంచి పేరు వచ్చింది. అయితే సమంత తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ సినిమాకు డేట్లు సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత జాన్వి కపూర్, కృతి శెట్టి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ పేరును దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాగూర్ ను దర్శ‌కుడు కొరటాల శివ సంప్రదించి… ఈ సినిమా కథ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

సీతారాం సినిమాలో సీత పాత్రతో మెప్పించిన ఈ అమ్మడి నటనకు ఇప్పుడు తెలుగు సినిమా జనాలు ఫిదా అవుతున్నారు. కొరటాలకు కూడా మృణాల్‌ ఠాగూర్ చేసిన సీత పాత్ర‌ బాగా నచ్చడంతో ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎన్టీఆర్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కొరటాల ఆమెను కలిసి ఎన్టీఆర్ సినిమా గురించి కథ చెప్పగా ఆసక్తితో వింద‌ట‌. ఈ సినిమాలో నటింప‌జేసేందుకు దాదాపు ఓకే చెప్పింద‌ట‌. ఇక మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ గా కోటిన్నర వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. పైగా ఆచార్య సినిమాతో దెబ్బతిని ఉన్న కొరటాల ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. పైగా త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే హీరోయిన్ ఎంపిక విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదట అందుకే హీరోయిన్ ఎంపిక అంత లేట్ అవుతుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news