Moviesబాల‌య్య 108పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది.. నంద‌మూరి ఫ్యాన్స్‌కు మ‌రో మాస్...

బాల‌య్య 108పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది.. నంద‌మూరి ఫ్యాన్స్‌కు మ‌రో మాస్ జాత‌ర‌..

ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న అప్‌డేట్ రానే వ‌చ్చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ 108వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది. గ‌తేడాది అఖండ‌తో అదిరిపోయే హిట్ కొట్టిన బాల‌య్య అదే స్వింగ్‌లో మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ ప్రాజెక్టులో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ ప్రాజెక్టు ఇప్ప‌టికే 70 శాతానికి పైగా పూర్త‌య్యింది. ఇక బాల‌య్య నెక్ట్స్ అనిల్ రావిపూడితో ట్రావెల్ కానున్నాడు.

ఈ సినిమా ఉంద‌ని గ‌త ఆరేడు నెల‌ల క్రిత‌మే క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు ఎట్ట‌కేల‌కు సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ సినిమా గురించి ఈ రోజు సాయంత్రం అప్‌డేట్ ఇస్తున్న‌ట్టు ముందుగానే ఎనౌన్స్ చేశారు. ఇక రిలీజ్ చేసిన వీడియోలో బాల‌య్య 108 గురించి క్లారిటీ ఇచ్చారు. బాల‌య్య 108 గురించి బ్యాక్‌గ్రౌండ్‌లో అదిరిపోయే మ్యూజిక్ వ‌స్తుండ‌గా సినిమా గురించి రివీల్ చేశారు.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే ఈ సినిమాను సైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, చంటి పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న‌ట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాల‌య్య 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే అనిల్ రావిపూడి చెప్పేశారు. బాల‌య్య కుమార్తెగా శ్రీలీల న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా నంద‌మూరి ఫ్యాన్స్ మాస్ జాత‌ర‌కు మ‌ళ్లీ రెడీ అయిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news