Moviesఅది చాలా హాట్ గా ఉంటుంది..స్టార్ హీరో భార్య పై మోజుపడ్డ...

అది చాలా హాట్ గా ఉంటుంది..స్టార్ హీరో భార్య పై మోజుపడ్డ కరణ్ జోహార్ ..!?

ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో నిర్మాత చక్రం తిప్పడం కామన్. టాలీవుడ్‌లో దిల్ రాజు బడా నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. అదే విధంగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. అంతే కాకుండా బాలీవుడ్ లో పలువురు స్టార్ కిడ్స్ ను కరణ్ జోహార్ పరిచయం చేశారు. కేవలం సినిమాలతో కాకుండా కరణ్ జోహార్ టాక్ షో తో కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో న‌టించాల‌ని ఎంతో మంది సెల‌బ్రిటీలు సైతం కాచుకుని ఉంటారు.

ఇక క‌ర‌ణ్ టాక్ షోల‌తో బాగా పాపుల‌ర్ అయ్యాడు. కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోలో స్టార్స్ ను ఇంటర్వూ లు చేస్తారు. అయితే ఇంటర్వ్యూ లలో స్టార్స్ సినిమా లకంటే వారి శృంగార జీవితం… లవ్ ఎఫైర్స్ గురించే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. దాంతో కరణ్ ఇంటర్వ్యూ అంటేనే స్టార్స్ భయపడిపోతుంటారు. మరో వైపు కరణ్ కేవలం స్టార్స్ కిడ్స్ కు మాత్రమే ఆఫర్స్ ఇస్తారని బాలీవుడ్ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. కరణ్ ఏ సినిమా చేసినా బైకాట్ కరణ్ జోహార్ అంటూ ట్రెండింగ్ లోకి తీసుకు రావ‌డం ఇటీవ‌ల కామ‌న్ అయ్యింది.

 

ఇక తరచూ ఏదో ఒక విధంగా వివాదాల్లో నిలిచే కరణ్ హీరోయిన్ లతో లవ్ ఎఫైర్స్ విషయంలో మాత్రం ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కలేదు. మరోవైపు కరణ్ నపుంసకుడు అనే ఓ టాక్ కూడా ఉంది. అయితే కరణ్ గతం లో మాత్రం ఓ హీరోయిన్ ను తాను ప్రేమించానని చెప్పాడు. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ కన్నా. తాను ప్రేమించిన ఓకే ఒక్క మహిళ ట్వింకిల్ కన్నా అంటూ కరణ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఈ విషయం పై ట్వింకిల్ ఓ ఇంటర్వ్యూ లో స్పందించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కరణ్ జోహార్ ఒకప్పుడు తనను లవ్ చేశాడని… త‌న‌కు లైట్ గా మీసం ఉండేది అని ట్వింకిల్ చెప్పారు. కరణ్ తనతో నీ మీసం చాలా హాట్ గా ఉందని….నాకు అది ఇష్టం అని చెప్పేవాడు అని ట్వింకిల్ వెల్లడించారు. ప్రస్తుతం ట్వింకిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక కరణ్ తాజాగా విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నెగిటివ్ టాక్‌తో న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news