Moviesవిద్యాసాగ‌ర్‌తో పెళ్లి వ‌ద్దే వ‌ద్ద‌ని చెప్పిన మీనా మ‌ళ్లీ ఎందుకు ఓకే...

విద్యాసాగ‌ర్‌తో పెళ్లి వ‌ద్దే వ‌ద్ద‌ని చెప్పిన మీనా మ‌ళ్లీ ఎందుకు ఓకే చెప్పింది…. ఏం జ‌రిగింది..!

నిన్నటి తరం హీరోయిన్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్ల‌లో మీనా ఒక‌రు. తమిళనాడులో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో పాపులర్ హీరోయిన్‌గా దశాబ్ద కాలం పాటు కొనసాగింది. ఆమె తండ్రి మద్రాస్ లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అలాగే మీనా తల్లి రాజమల్లిక. ఈమె సైతం హీరోయిన్ గా కొన్ని సినిమాలు నటించింది. తల్లి రాజమల్లిక వారసత్వాన్ని కొనసాగిస్తూ మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

బాలనట్టుగా ఉన్న సమయంలో రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారితో నటించింది. ఆ తర్వాత వారి పక్కనే హీరోయిన్‌గా కూడా చేసి అలనాటి శ్రీదేవి తర్వాత మీనా మాత్రమే ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారితోనే హీరోయిన్‌గా చేసిన పేరు సొంతం చేసుకుంది. ఇక మీనా నటించిన తమిళ సినిమాలు ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ము ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలుగులో వెంకటేష్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాలో నటించింది మీనా. వీరు నటించిన సుందరకాండ, చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు వంటి సినిమాలన్నీ కూడా మంచి హిట్ అందుకున్నాయి.

మీనా సినిమాల్లో నటిస్తున్నంత కాలం వివాదాలకు దూరంగా ఉండేది సాధారణంగా ఒక గ్లామర్ హీరోయిన్ అంటే ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో లేదంటే మీడియాలో నానుతూనే ఉంటారు. కానీ మీనా మాత్రం వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండేది. ఇక సినిమాలకు స్వస్తి చెప్పిన తర్వాత మీనా విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి పెద్దలు కుదర్చ‌గా వీరికి నైనిక అనే కూతురు ఉంది. నైనికా సైతం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవ‌ల మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ లంగ్ ఇన్‌ఫెక్ష‌న్‌తో మృతిచెందిన సంగతి తెలిసిందే.

ఇక విద్యాసాగర్ మీనాలో పెళ్లికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీనాకి అమె తల్లి రాజమల్లిక అనేక పెళ్లి సంబంధాలను చూసిందట. అయితే మీన మేనత్త విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోవాలని వారికి ఒక మీటింగ్ అరేంజ్ చేసిందట. అయితే విద్యాసాగర్ అభిప్రాయాలు తన అభిప్రాయాలు వేరుగా ఉండటం అలాగే వృత్తులు కూడా కలవకపోవడంతో అతడికి నో చెప్పేసింది. దాంతో ఎంతో వినయంగా ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడట విద్యాసాగర్.

కానీ మీనా మేనత్త ఆమెను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించిందట. విద్యాసాగర్ లాంటి వ్యక్తిని కోల్పోతే జీవితంలో మళ్ళీ అలాంటి అబ్బాయిని పొందలేవ‌ని గట్టిగా చెప్పిందట. దాంతో మరోమారు కలిసి మాట్లాడి విద్యాసాగర్ తో పెళ్లికి ఓకే చెప్పిందట. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆమె జీవితకాలం ఎలాంటి రీగ్రేట్ ఫీల్ కాలేదని ఓ సందర్భంలో చెప్పింది మీనా. తన భర్త తనను ఎంతో బాగా చూసుకున్నాడంటూ తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news