Moviesప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ నాని వార్‌... ఈ క్లాష్ ఎందుకు సామీ...!

ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ నాని వార్‌… ఈ క్లాష్ ఎందుకు సామీ…!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నేచురల్ స్టార్ ఇన్ నాని ఇద్దరు ఇమేజ్‌లు వేరువేరు. పవర్ స్టార్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ? సందడి వాతావరణం ఉంటుందో ? ఎంత పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారో ? థియేటర్ దగ్గర ఎంత కోలాహాలంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇటీవల పవన్ రాజకీయాలు.. సినిమాలు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూపులు చూస్తున్నారు.

నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం. రత్నం నిర్మిస్తున్నారు. రత్నం గతంలో పవన్ కళ్యాణ్ తో ఖుషి – బంగారం లాంటి సినిమాలు నిర్మించారు. ఈ సినిమాను 2023 మార్చి 30న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. పీరియాడిక్ మూవీగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. అంటే వచ్చే సమ్మర్లో తెలుగు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ పవన్ కళ్యాణ్ సందడి ఫిక్స్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ తో నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్నారు.

నాని తాజాగా అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా క‌థ‌, కథనాలు బాగున్నా అంచనాలు అందుకోలేదు. ఇక తాజాగా నాని హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కిస్తోన్న మాస్ మూవీ ద‌స‌రా. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌తంలో కీర్తి – నాని కాంబోలో వ‌చ్చిన ఎంసీయే సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా 2023, మార్చి 30న విడుదల చేస్తున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

 

దీంతో వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ఒకే రోజు నాని వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంట్ర‌స్టింగ్ క్లాష్ జ‌ర‌గ‌నుంది. క‌థా బ‌లం ఉంటే ప‌వ‌న్ సినిమాకు పోటీగా నాని సినిమా వ‌చ్చినా ఇబ్బంది ఉండ‌దు. అయితే క‌థ‌లో ఏ మాత్రం తేడా కొట్టినా నాని సినిమా న‌లిగి పోతుంది. ఇక ప‌వ‌న్‌కు కూడా ఇటీవల త‌న రేంజ్‌కు త‌గ్గ హిట్లు అయితే ప‌డ‌డం లేదు. మ‌రి హరిహ‌ర‌తో ఫామ్‌లోకి వ‌స్తాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news