Movies"ఆ కళ్లలోనే అంత ఉంది"..టాలీవుడ్ హీరో ని బాలీవుడ్ బ్యూటీ ఎంత...

“ఆ కళ్లలోనే అంత ఉంది”..టాలీవుడ్ హీరో ని బాలీవుడ్ బ్యూటీ ఎంత బాగా వివరించిందో..!!

అబ్బా..ఏమున్నాడు రా బాబు..ఆ హైట్ ఆ వెయిట్..ఆ కటౌట్ చూసీ కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్. అలాంటి కటౌటే మన ప్రభాస్ ది. కష్టపడి పైకి వచ్చిన హీరో ని చూయించండి అంటే ఖచ్చితంగా చిరంజీవి తరువాత మనం ప్రభాస్ పేరు చెప్పచ్చు. ఈశ్వర్ సినిమా లో ప్రభాస్ కి ..ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి మనం తేడా చూస్తే ఆ విషయం క్లీయర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఏం ఒక్క సినిమాతో స్టార్ హీరో అవ్వలేదు.

ఎన్నో ఫ్లాప్ సినిమాలు రుచి చూసి..తప్పు ఒప్పులని తెలుసుకుని..తనలోని మైనస్లను ప్లస్ లుగా మార్చుకుంటూ..సొంత టాలెంట్ తో ఇప్పుడు టాప్ హీరోల లిస్ట్ లోకి వచ్చాడు. అంతేనా, ఏ హీరో తీసుకోనటువంటి రెమ్యూనరేషన్ ని అందుకుంటూ మిగతా హీరోలకి దడ పుట్టిస్తున్నాడు. ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కేవే. కాగా, ప్రభాస్ ఆది పురుష్ సినిమా పై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. సరికొత్త లుక్ తో ప్రభాస్ మనకి కనిపిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం.

అయితే, తాజా గా ఈ రాముడు పై సీతమ్మ..అదే బాలీవుడ్ హీరోయిన్ కృతిసనస్..కూల్ కామెంట్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ భామ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్‌ను ఓ రేంజ్ లో పొగిడేసింది కృతి సనన్.

‘ప్రభాస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కో స్టార్స్ నుంచి లైట్‌బాయ్‌ వరకు ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారు. క్లోజ్ గా మాట్లాడుతారు. ఆయన తో మాట్లాడుతుంటే మనకి టైం తెలియదు. ముఖ్యంగా ఆయన కళ్లలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ఆ స్వచ్ఛత, ఆకర్షణ ..క్లీయర్ గా తెలిసిపోతాయి. ఆ కళ్లలోని భావాల్ని అర్థం చేసుకుంటే చాలు ఆయన మనసు ఎంత మంచిదో అర్ధమైపోతుంది. ఆయనతో మరో సినిమా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా..”అంటూ ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news