Moviesఓరి నీ వేషాలో!..తెలుగు స్టార్ హీరోని గుర్తుపట్టని రష్మిక..ఇది మరీ టూమచ్...

ఓరి నీ వేషాలో!..తెలుగు స్టార్ హీరోని గుర్తుపట్టని రష్మిక..ఇది మరీ టూమచ్ గా ఉందే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలి అంటే అందం , టాలెంట్, లక్ ఎంత ముఖ్యమో..అలానే మాటకారితనం కూడా ఉండాలి. నలుగురు హీరోలతో రాసుకుని పూసుకుని తిరిగితేనే..మనం వార్తల్లో ను ఉంటాం ..తద్వార అవకాశాలు వస్తాయి అని అనుకునే హీరోయిన్స్ కూడా ఉన్నారు. నమ్మడానికి కష్టమే అయిన ఇది నిజం. ఈ విషయం అందరికి తెలుసు. అయితే, రష్మిక ఈ లిస్ట్ లోకి వస్తుందో లేదో తెలియదు కానీ..తాజాగా అమ్మడు చేసిన పోస్ట్ బట్టి చూస్తే..కొంచెం ఎక్స్ట్రాలు చేస్తుంది అంటున్నారు నెటిజన్స్.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మూడు ఇండస్ట్రీలను మిక్సీ లో వేసి తిప్పి కొటి జ్యూస్ చేసుకుని తాగేస్తుంది ఈ కన్నడ బ్యూటి. రష్మిక అంత టాలెంట్ ఏం ఉందో కానీ..బాలీవుడ్ జనాలు అయితే..ఈ బ్యూటి కోసం పడి చచ్చిపోతున్నారు. సినిమా రిలీజ్ కాకముందే..అమ్మడు పర్ ఫామెన్స్ చూడకముందే వరుస ఆఫర్లు ఇస్తూ..టాప్ పొజీషన్ లో కూర్చో పెట్టారు. ఇక కోలీవుడ్ లోను అదే పరిస్ధితి. టాలీవుడ్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఊ అన్నా రష్మికనే..ఊ ఊ అన్నా రష్మికనే అంటున్నారు.

ఇలా నిరంతర, మీడియాలో నిలిచే రష్మిక..ఇప్పుడు అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ తో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇటీవల పాపులర్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ పైప్ కంపెనీ ‘ఆస్ట్రాల్’ కోసం అల్లు అర్జున్ ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి చేశారు. హైలెట్ పాయింట్ ఏమిటంటే ఈ యాడ్ కి డైరెక్టర్ హరీశ్ శంకర్.

తాజాగా ఈ యాడ్ షూట్ కు సంబంధించిన అల్లు అర్జున్ నయా లుక్ పిక్స్ బయటికి వచ్చాయి. చాలా స్టైలీష్ గా ఢిఫరెంట్ గా ఉన్నాడు బన్నీ. దీని పై రష్మిక స్పందిస్తూ..” ‘దేవుడా.. ఒక్క క్షణం మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను సార్’ అంటూ కామెంట్ చేసుకొచ్చింది. అయితే దీని పై రష్మిక ను కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. “నీకు బాలీవుడ్ ముఖాలే గుర్తుంటాయిలే”..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ పై రష్మిక కామెంట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news