Moviesవిజయ్ దేవరకొండ హీరో కాదు జీరో..వేస్ట్ గాడు..బాలీవుడ్ నటుడు డేరింగ్ కామెంట్స్..!!

విజయ్ దేవరకొండ హీరో కాదు జీరో..వేస్ట్ గాడు..బాలీవుడ్ నటుడు డేరింగ్ కామెంట్స్..!!

గురువారం నాడు గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే లైగర్ సినిమాపై హ్యూజ్ నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సినిమాపై పలువురు నెగిటీవ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో లైగర్ పరువు తీసేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ విజయ్ దేవరకొండ ను ,లైగర్ సినిమాను, ఏకి పారేశారు.

లైగర్ గురించి ఆయన మాట్లాడుతూ..” ఈ సినిమాలో చాలా ఓల్డ్ సీన్స్ రిపీట్ అయ్యాయి . ఫస్ట్ సీన్ నే విజయ్ దేవరకొండ రమ్యకృష్ణ ఛాయ్ దుకాణం ముంబైలో నడుపుతుండగా అక్కడికి వీధి రౌడీలు వచ్చి.. రమ్యకృష్ణను ఏడిపిస్తారు.. అప్పుడు కొడుకు విజయ్ దేవరకొండ ఫైట్ చేసి హీరోగా చూపిస్తాడు.. ఈ సీన్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో వచ్చింది. అదే స్సిన్ మళ్ళీ కాపీ కొట్టి పూరి తప్పు చేశాడు. అదేవిధంగా ఇప్పటివరకు బాక్సింగ్ నేపథ్యంలో తీసిన సినిమాలన్నీ సీన్స్ ను మిక్స్ చేసి లైగర్ సినిమాను తీసిన్నట్లు ఉంది . తుఫాన్ సినిమాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నా అంచనా ప్రకారం దాదాపు 64 సీన్లు అంత యాక్షన్ ఎపిసోడ్స్ కాపీ కొట్టేశాడు పూరి జగన్నాథ్. దీంతో సినిమా ఫ్లాఇ టాక్ ను సంపాదించుకోవడానికి కారణం అయ్యింది.

” నా వరకు చుకి పాండే పాత్ర తప్పిస్తే సినిమా లో మిగతా ఏ పాత్ర నచ్చలేదు. రమ్యకృష్ణ ఏమో అరుస్తూ ఉంటుంది. అనన్య గ్లామర్ కే పనికి వచ్చింది. విజయ్ ఏం మాట్లాడాడో అర్ధం కాలేదు.. మిగతా సినిమా అంతా ఏం జరిగిందో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే స్టార్ లెజెండ్ మైక్ టైసన్ ను కామెడీగా చూపించడం దారుణం. అది పూరి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అసలు ఈ సినిమాని నిర్మించింది కరణ్ జోహార్ నేనా అని డౌట్ వస్తుంది. బాగోలేదు సినిమా ఏ మాత్రం బాగోలేదు. పూరీ జగన్నాథ్ ఫ్లాప్ స్టోరీ.. స్క్రీన్ ప్లే …డైలాగ్స్ నాకు నచ్చలేదు. ఎవరైనా అసిస్టెంట్ ని పెట్టుకొని సినిమా తీసుంటే బాగుండేది. విజయ్ దేవరకొండ అంటున్నారు ఆయన గురించి పెద్దగా నాకు తెలీదు.

అతను సినిమా బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ కావడం ఆయన ను ఓ రేంజ్ హీరో అని చెప్పుకోవడం విన్నానే కానీ డైలాగ్స్ కూడా సరిగ్గా పలకలేక పోయాడు . అది నత్తి కారణంగానో ఆయనలోని డిఫెక్ట్ అనేది నాకు తెలియదు. నా వరకైతే విజయ్ దేవరకొండ యాక్టింగ్ 0 మార్క్స్ ఇస్తాను” అంటూ కే ఆర్ కే సంచలన కామెంట్స్ చేశారు. “ఫైనల్ గా ఈ సినిమాను చూడాలంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ అయితే చూడండి లేదంటే హాయిగా దేనికైనా ఖర్చు చేసుకొని ఎంజాయ్ చేయండి” అంటూ కామెంట్ చేశారు. దీంతో మరికొందరు నెటిజన్స్ విజయ్ దేవరకొండ వేస్ట్ హీరో అంటూ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news