ఖడ్గం సినిమాతో టాలీవుడ్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సంగీత. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గంలో తన నటనతో సంగీత అదరగొట్టింది. ఈ సినిమాలో పల్లెటూరి నుంచి ఇండస్ట్రీకి వచ్చిన అమాయకమైన అమ్మాయిలా నటించి మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించింది. చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు సంగీత ఎంతో దగ్గరయ్యింది. ఈ సినిమా తరవాత శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లాం ఊరెళితే సినిమాలో కూడా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కు భార్యగా నటించి మెప్పించింది.
ఆ తరువాత బాలయ్యతో విజయేంద్రవర్మ, రవితేజకు జోడీగా ఈ అబ్బాయి చాలా మంచోడు, శివపుత్రుడు సినిమాలతో నటిగా పాపులారిటిని సంపాదించుకుంది. కొన్ని సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన సంగీత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. సంగీత సింగర్ క్రిష్ ను వివాహం చేసుకుని ఫ్యామిలీతో ఉంటోంది. ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు బుల్లితెరపై కూడా పలు షోల్లో సందడి చేస్తోంది.
ఇదిలా ఉండగా సంగీత అప్పట్లో వివాదాల్లో చిక్కుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సంగీత తన తల్లి ఒకే ఇంటిలో ఉంటున్నారు. సంగీత తన భర్తతో పై అంతస్థులో ఉంటే.. ఆమె తల్లి తన పెద్ద కుమారుడితో కలిసి కింద అంతస్థులో నివాసం ఉంటున్నారు. కాగా సంగీత తల్లి తనను సంగీత ఇల్లు కాళీ చేసి వెళ్లిపోవాలని వేధిస్తోందని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ వార్త టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. దాంతో సంగీత ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చింది.
తన తల్లి 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే తనను డబ్బులు సంపాదించే వస్తువుగా వాడుకుందని చెప్పింది. తన అన్న, తమ్ముడు మత్తుకు బానిసలు అయ్యారని ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదని చెప్పింది. కానీ తన తల్లి మాత్రం వాళ్ళను వెనకేసుకు వస్తు తనను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి అంటే ఎలా ఉండకూడదో తన తల్లిని చూసి నేర్చుకున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పుడు తన పైనే కేసులు పెట్టి పరువు తీయాలని చూసింది అని… తను పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉండటం తన తల్లికి ఇష్టం లేదని ఆరోపించింది. తన కుటుంబంలో కలహాలు పెట్టేందుకు కూడా ప్రయత్నించింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అలా అప్పుడు సంగీత చేసిన కామెంట్స్
పెద్ద సంచలనం అయ్యాయి.