Moviesయూఎస్‌లో ' బింబి ' అరాచ‌కం... ఇవేం వ‌సూళ్లురా బాబు...!

యూఎస్‌లో ‘ బింబి ‘ అరాచ‌కం… ఇవేం వ‌సూళ్లురా బాబు…!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట కాంబోలో వచ్చిన లేటెస్ట్ సోషియో పాంట‌సీ, హిస్టారిక‌ల్ మూవీ బింబిసారా. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ రు. 37 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే గ‌తంలో ఏ సినిమాకు రానంత మంచి టాక్ బింబిసార సొంతం చేసుకుంది. తొటి రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బింబిసార ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లోనే ఏకంగా రు 6.3 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌లో 40 శాతానికి పైగా ఫ‌స్ట్ డే రిక‌వ‌రీ చేసుకోవ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. ఇక శ‌ని, ఆదివారం కూడా ఈ సినిమాకు అదిరిపోయే బుకింగ్స్ న‌మోద‌య్యాయి. ఆదివారం నాలుగు షోల‌కు కూడా చాలా చోట్ల టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్తితి ఉంది. సినిమా సోషియా ఫాంట‌సీ, రాజుల నేప‌థ్యంలో తెర‌కెక్క‌డం.. రొటీన్‌కు భిన్న‌మైన టేకింగ్ కావ‌డంతో ఎక్కువ మంది ప్రేక్ష‌కులు బింబిసార‌ను చూసేందుకు ఆస‌క్తితో ఉన్నారు.

ఇదిలా ఉంటే యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బింబిసార అరాచ‌కం చూపిస్తూ అద‌ర గొట్టేస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 2 లక్షల 50 వేల డాలర్స్ వసూళ్లను క్రాస్ చేసేసి సూపర్ స్ట్రాంగ్ అయ్యింది. అంతేకాకుండా శ‌ని, ఆదివారాల నుంచే యూఎస్‌లో ప‌లు చోట్ల అద‌న‌పు స్క్రీన్ల‌ను కూడా యాడ్ చేశారు. ఓవ‌రాల్‌గా చూస్తే బింబి విధ్వంసం ఏపీ, తెలంగాణతో పాటు అటు ఓవ‌ర్సీస్‌లోనూ క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news