Moviesమళ్లీ హాట్ టాపిక్ గా మారిన శ్రావణ భార్గవి..ఈసారి ఏకంగా ...

మళ్లీ హాట్ టాపిక్ గా మారిన శ్రావణ భార్గవి..ఈసారి ఏకంగా ఆ స్టార్ హీరో తోనే ..!!

స్టార్ సింగర్ శ్రావణ భార్గవి..ఈ పేరు గత కొద్ది రోజుల నుండి మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. అంతకముందే తన సూపర్ గాత్రంతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత చేతికి వచ్చిన పాటలు పాడుతూ..సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని..హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అయితే సడెన్ గా శ్రావణ భార్గవి తన భర్త అయిన సింగర్ హేమ చంద్ర తో విడాకులు తీసుకోబోతుంది అని..ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది.

కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్న ఈ జంట వన్ ఫైన్ డే..”మేము కలిసే ఉన్నాం…మమ్మల్ని విడతీయ్యకండీ” అంటూ ఓ పోస్ట్ పెట్టు చేతులు దులుపుకునేసింది. సరే ఈ మ్యాటర్ కూల్ అయ్యిందిలే అనుకుంటే వెంటనే ఆమె తన ఛానెల్ లో ఒకపరి సాంగ్ ను అవమానించిందని అన్నమయ్య వంశాచార్యులు ఫైర్ అయ్యారు. ఈ గొడవ కారణంగా శ్రావణ భార్గవి దాదాపు ఒక వారం..హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు. ఆ తరువాత ఆమె వెనక్కి తగ్గి..వీడియో ను డిలీట్ చేసింది.

ఇక ఆ మళ్లీ ఇప్పుడు..మీడియాలో హైలెట్ గా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా లో అమ్మడు ఓ అద్భుతమైన సాంగ్ ను పాదింది. ఇప్పటికే ఆ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక దుమ్ము దులిపేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి శ్రావణ భార్గవి చివరిగా 2018లో వచ్చిన ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలో సింగర్‌గా ఆకట్టుకుంది.

ఆ తరువాత ఎందుకు సినీ రంగానికి దూరంగా ఉంది. ఇక చాలా కాలం తరువాత ఆమె మళ్ళీ ఇలా సినిమాలో పాటలు పాడటం ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. లైగర్ లో రొమాంటిక్‌ పాటగా వచ్చిన ‘ఆఫత్‌’ సాంగ్‌ తెలుగు వెర్షన్‌ను శ్రావణ భార్గవి ఆలపించింది. ఈ పాట‌తో శ్రావ‌ణ భార్గ‌వి తిరిగి త‌న పూర్వ వైభ‌వాన్ని అందుకుంటుంది అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news