Moviesఆ ఇద్దరు హీరోలను నమ్మే నభా ఇంత దిగజారడానికి కారణమా..?

ఆ ఇద్దరు హీరోలను నమ్మే నభా ఇంత దిగజారడానికి కారణమా..?

నభా నటేష్..ఇస్మార్ట్ బ్యూటీగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. కన్నడం తెలుగు, తమిళ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన నభా, తెలుగులో నన్నుదోచుకుందువటే, అదుగో సినిమాలు చేసింది. అయితే, ఈ సినిమాలలో నభా బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోయిన్‌గా మాత్రం నభాకి క్రేజ్ దక్కలేదు. ఇలాంటి సమయంలో పూరి సాలీడ్ ఆఫర్ ఇచ్చాడు. అదే ఇస్మార్ట్ శంకర్.

ఈ సినిమాలో రామ్‌ పోతినేని హీరోగా నిధీ అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటించింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పూరి అందుకున్న భారీ కమర్షియల్ హిట్ సినిమా ఇది. మొత్తం యూనిట్ అందరికీ ఈ సినిమా మైల్ స్టోన్ లాంటి సక్సెస్‌గా నిలిచింది. నిధి అగర్వాల్, నభా నటేష్‌లకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు పూరి. దీంతో ఇద్దరికీ మంచి అవకాశాలు దక్కాయి. నిధి అగర్వాల్‌కి తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది.

వీటిలో మూడు సినిమాలు రిలీజైయ్యాయి. ఒక్క హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఇక నభా విషయానికొస్తే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలు చేసింది. అయితే, నితిన్..బెల్లంకొండ శ్రీనులను నమ్మి అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలు ఒప్పుకుంది. అప్పటికే, రవితేజ సినిమా చేసి షాక్‌కు గురైన నభా అది తేరుకోకుండానే ఈ రెండు సినిమాలు చేయడం పెద్ద మైనస్ అయింది.

మాస్ట్రో, అల్లుడు అదుర్స్ సినిమాలు నభా కెరీర్‌ను పూర్తిగా దెబ్బ తీశాయి. ఇప్పుడు నభాకి ఒక్క అవకాశం కూడా లేదు. ముఖ్యంగా రవితేజ, బెల్లంకొండ శ్రీను, నితిన్‌లను నమ్మే నభా ఏదో ఊహించుకొని ఏదో అయిపోయింది. ఇప్పుడేమో అందాలు ఆరబోస్తూ అవకాశాల కోసం ఆవురావురంటూ ఎదుచూస్తుంది. మరి ఎవరైనా నభాని పట్టించుకుంటారో లేదో పాపం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news