Moviesసమంత అకౌంట్లో 250 కోట్లు..షాకింగ్ విషయాని బయటపెట్టిన బ్రహ్మాజీ..!!

సమంత అకౌంట్లో 250 కోట్లు..షాకింగ్ విషయాని బయటపెట్టిన బ్రహ్మాజీ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. వీళ్లు కలిసి చేసిన ఏం మాయ చేసావే సినిమా టైం లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్లు ప్రేమను బయటపెట్టి ఇంట్లోని పెద్దలను ఒప్పించి గోవాలో గ్రాండ్ గా ఒకటైయ్యారు. వీళ్ళ పెళ్లి టైంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ పాటలు ఆ డ్యాన్సులు ..ఆ షాపింగ్.. అబ్బో అన్నీ ఇన్ని కాదు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఇంట్లో పెద్దలను ఒప్పించి ఒకటైన ఈ జంట పట్టుమంటే పది సంవత్సరాలు కూడా కాపురం చేయకుండానే తమ పెళ్లిని పెటాకులు చేసుకున్నారు.

రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత నాగచైతన్య విడిపోయారు. వీళ్ళు విడాకులు తీసుకున్న టైంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది సమంత పైన. ఇద్దరు విడాకులు తీసుకున్నా జనాలు మాత్రం తప్పుప్ప అంతా సమంతదే అంటూ టార్చర్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ” నువ్వు ఆడదానివేనా” అంటూ సూటి పోటీ మాటలతో ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. మరి కొంతమంది నెటిజన్స్ అయితే ఆమెను ఏకంగా “నువ్వు డబ్బు కోసమే నాగచైతన్యను పెళ్లి చేసుకున్నావు ” అని దారుణంగా మాట్లాడారు.


ఓ నెటిజన్ అయితే ఏకంగా “నువ్వు నాగచైతన్య నుండి 250 కోట్లు తీసుకున్నావంటూ” షాకింగ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ కామెంట్ పై సమంత కూడా ఘాటుగా స్పందించింది. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ కామెంట్ పై నటుడు బ్రహ్మాజీ కూడా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాని బయటపెట్టారు.
“నెటిజన్స్ సెలబ్రిటీల తో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని.

 

ఒక సెలబ్రిటీ జీవితంపై వ్యక్తిగతంగా మనం కామెంట్ చేసే రైట్ మనకు లేదంటూ” ఆయన
ఘాటుగా స్పందించారు. “సమంత చాలా మంచిదని.. తన కష్టంతో తన టాలెంట్ తో పైకొచ్చిందని ..ఆమెకి ఎవరు సహాయం అవసరం లేదని.. ఒక్క రూపాయి కూడా సమంత ఊరికే తీసుకోదని..” ఆయన చెప్పుకొచ్చారు.” సెలబ్రిటీలతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నెటిజన్స్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని.. అవకాశం వచ్చింది కదా అని వాళ్ళని డౌన్ చేయడానికి మాట్లాడకూడదని.. ఆ పాపం ఊరికే పోదని” ఆయన చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news