Moviesవారెవ్వా: క్రేజీ ఆఫర్ కొట్టేసిన సొట్టబుగ్గల సుందరి..జాక్ పాట్ కొట్టిందిగా..?

వారెవ్వా: క్రేజీ ఆఫర్ కొట్టేసిన సొట్టబుగ్గల సుందరి..జాక్ పాట్ కొట్టిందిగా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్న..ఏంటో బిగ్ స్టార్స్ అందరు..కుర్ర బ్యూటీల పైనే మోజు పడుతున్నారు. పూజా హెగ్డే, రష్మిక, సమంత, తమన్నా..లాంటి బిగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఫుల్ ఫాంలో ఉన్నా.. ఇప్పుడు కృతి శెట్టి, శ్రీలీల లాంటి కుర్ర బ్యూటీలతో సినిమాలు చేయడానికే స్టార్స్ ఇష్టపడుతున్నారు. వాళ్లతో సినిమాలు చేసి బోర్ కొట్టిందో..లేక కుర్ర బ్యూటీల అందానికి ఫిదా అయ్యారో తెలియదు కానీ..ప్రజెంట్ కుర్ర బ్యూటిలదే హవా అయిపోయింది.

పెళ్లి సందD సినిమాతో తన దైన స్టైల్ లో నటించి అలరించి..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న కుర్ర బ్యూటీ శ్రీలల ప్రజెంట్ మంచి క్రేజ్ లో ఉంది. ఇప్పటికే బిగ్ ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటి.. తాజాగా మరో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన్నట్లు తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో త్వరలోనే తెరకెక్కబోతున్న..SSMB28 లో సెకండ్ హీరోయిన్ గా అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే..బాలయ్య కూతురుగా ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈ బ్యూటి. ఆల్ రెడీ రవి తేజ ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఇప్పుడు మహేశ్ బాబు లాంటి క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడం నిజంగా అమ్మడి లక్ అనే చెప్పలి. ఇది వరకే అమ్మడుకి ఈ ఆఫర్ రాగా..సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ తో వద్దు అనుకున్నిందట. ఇక ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ మరొసారి అప్రోచ్ అవ్వగా..పైగా కధలో కొన్ని మార్పులు చేసి…సెకండ్ హీరోయిన్ కి కూడా మంచి షాట్స్ పడటంతో..అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కుర్ర బ్యూటీ శ్రీలీల జాక్ పాట్ కొట్టిందిగా..అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news