Moviesఆ సినిమా షూటింగ్‌లో త‌న కెరీర్ నాశ‌న‌మైంద‌ని ఏడ్చేసిన ఆర్తీ అగర్వాల్‌......

ఆ సినిమా షూటింగ్‌లో త‌న కెరీర్ నాశ‌న‌మైంద‌ని ఏడ్చేసిన ఆర్తీ అగర్వాల్‌… షాకింగ్ సీక్రెట్‌…!

ఆర్తీ అగ‌ర్వాల్ దివంగత క్రేజీ హీరోయిన్‌. రెండు ద‌శాబ్దాల క్రితం ఆర్తీ అగ‌ర్వాల్ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ఎలా ? ఊపేసిందో చూశాం. నువ్వునాకున‌చ్చావ్ సినిమాతో హీరోయిన్ అయిన ఆర్తీ మూడు నాలుగేళ్ల పాటు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఎంత త‌క్కువ టైంలో స్పీడ్‌గా పాపుల‌ర్ అయ్యిందో అంతే స్పీడ్‌గా ఫేడ‌వుట్ అయిపోయింది. ఆర్తీ కెరీర్ అంత త్వ‌ర‌గా నాశ‌నం కావ‌డానికి రెండే ప్ర‌ధాన కార‌ణాలుగా ఇండ‌స్ట్రీ జ‌నాలు చెపుతారు. ఒక‌టి యంగ్ హీరో త‌రుణ్‌తో ఆమె ప్రేమాయ‌ణం, రెండోది ఆమె శ‌రీరంపై కంట్రోల్ లేక‌పోవ‌డం.. విప‌రీతంగా బ‌రువు పెరిగిపోవ‌డంతో ఆమెకు ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌లేదు.

చివ‌ర‌కు ఆమె ర‌ణం 2 లాంటి సినిమాలో అమ్మ రాజ‌శేఖ‌ర్ ప‌క్క‌న న‌టించింది. అలాగే చిన్న పిల్లాడికి జోడీగా సినిమా చేసింది. అస‌లు ఆ సినిమాల్లో ఆర్తీని చూసిన వాళ్లు స్టార్ హీరోయిన్ ఆర్తీనేనా ఈ సినిమాలు చేస్తుంద‌ని సందేహించారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే ఆమె త‌రుణ్‌ను పిచ్చిగా ప్రేమించింద‌నే అంటారు. త‌ర్వాత బ్రేక‌ప్‌.. ఆ బ్రేక‌ప్ త‌ర్వాతే ఆమె కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.

దీనికి తోడు బ‌రువు విప‌రీతంగా పెరిగిపోతూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అయితే ర‌ణం 2 సినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు ఆమె త‌న కెరీర్ పాడైపోయింద‌ని ఎంతో బాధ‌ప‌డ‌డంతో పాటు సెట్‌లోప‌లే ఏడ్చేసింద‌ట‌. షూటింగ్ మ‌ధ్య‌లో ఆరు నెల‌లు గ్యాప్ వ‌చ్చింద‌ట‌. ఆ త‌ర్వాత ఆమెకు ముందు కొల‌త‌ల ప్ర‌కారం కుట్టించిన కాస్ట్యూమ్స్ ప‌ట్ట‌డం లేద‌ట‌.

దీంతో ఆమె లోప‌ల‌కు వెళ్లి బ‌రువు పెరిగిపోవ‌డంతో త‌న కెరీర్ నాశ‌న‌మైంద‌ని తెగ ఏడ్చేసింద‌ట‌. వెంట‌నే ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. శ్రీహ‌రితో చెప్ప‌డంతో ఆమెను ఏం ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని శ్రీహ‌రి చెప్పార‌ట‌. చివ‌ర‌కు ఎంతో ఇబ్బంది ప‌డి మ‌రీ ఆ సినిమా షూటింగ్‌ను ఆర్తీ కంప్లీట్ చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని ఈ సినిమా ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌రే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఆ త‌ర్వాత వైవాహిక జీవితం కూడా ఆమెకు క‌లిసి రాలేదు. ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆ పెళ్లి కూడా క‌లిసి రాలేదు. చివ‌ర‌కు ఆప‌రేష‌న్ విక‌టించి చిన్న వ‌య‌స్సులోనే మృతిచెందింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news