Moviesఫ‌ర్‌ఫెక్ట్ బాడీ కోసం శ్రీదేవి చిన్న కూతురు క‌ష్టాలు... ఆర‌బోత‌లో రెచ్చిపోతోందిగా...!

ఫ‌ర్‌ఫెక్ట్ బాడీ కోసం శ్రీదేవి చిన్న కూతురు క‌ష్టాలు… ఆర‌బోత‌లో రెచ్చిపోతోందిగా…!

అతిలోక సుంద‌రి అందాల శ్రీదేవి తాను ఉండ‌గానే త‌న ఇద్ద‌రు కుమార్తెల‌ను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల‌ను చేయాల‌ని క‌ల‌లు కంటూ ఉండేది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు శ్రీదేవి కోరిక తీర‌కుండానే ఆమె మృతి చెందింది. అయితే ఇప్పుడు పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కుదురుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అయితే జాన్వీక‌పూర్‌కు రావ‌డం లేదు.

జాన్వీకి శ్రీదేవి స్టార్‌డ‌మ్ బాగా క‌లిసి వ‌చ్చింది. ఆమెకు క్రేజ్ క‌న్నా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో దూకుడు మీద ఉంది. పెద్ద కూతురు జాన్వీ ముందు నుంచే బాగా యాక్టివ్‌గా ఉండేద‌ట‌. అందుకు జాన్వీ విష‌యంలో శ్రీదేవికి పెద్ద‌గా టెన్ష‌న్ ఉండేది కాద‌ట‌. అందుకే ఆమె సినిమాల కంటే కూడా తల్లి స్టార్‌డ‌మ్‌ను వాడుకుని త‌క్కువ టైంలోనే మంచి ఛాన్సులు అయితే కొట్టేసింది.

శ్రీదేవికి ముందు నుంచే చిన్న కుమార్తె ఖుషి క‌పూర్ విష‌యంలో టెన్ష‌న్ ఉండేద‌ట‌. జాన్వీతో పోలిస్తే ఖుషి అంత చురుకుగా ఉండ‌ద‌న్న టాక్ ముందు నుంచే ఉంది. దీనికి తోడు ఆమెకు జాన్వీ అంత ఛ‌రిష్మా లేదు. పైగా ఆమె ప‌ళ్ల‌క‌ట్టు, పెదాలు స‌రిగా ఉండవ‌న్న టాక్ ఉంది. అందుకే తండ్రి బోనీక‌పూర్‌కు ఆమెకు ఇప్ప‌టికే రెండు స‌ర్జ‌రీలు కూడా చేయించాడని అంటున్నారు. ఎట్ట‌కేల‌కు ఇప్పట‌కీ ఆమెకు ఫ‌ర్‌ఫెక్ట్ బాడీ స్ట్ర‌క్చ‌ర్ అయితే వ‌చ్చిందంటున్నారు.

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అప్పుడు ఖుషి క‌పూర్ ఒక్కో సినిమాకు రు 1.50 కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌. ఆమెను ముందుగా బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌ట్టించుకోలేదు. అయితే బోనీక‌పూర్ కూతురు భ‌విష్య‌త్తు కోసం పెద‌వుల‌తో పాటు మ‌రో స‌ర్జ‌రీ చేయించి ఆమెకు ప‌ర్‌ఫెక్ట్ బాడీ స్ట్ర‌క్చ‌ర్ వ‌చ్చేలా చేసి ఆమె ఎంట్రీకే భారీ రెమ్యున‌రేష‌న్ వ‌చ్చేలా ప్లాన్ చేశాడు.

హీరోయిన్‌గా ఇంకా ఎంట్రీ ఇవ్వ‌కుండా ఖుషి క‌పూర్ అందాల ఆర‌బోత‌తో పాటు ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఏ మాత్రం మొహ‌మాటం లేద‌న్న‌ట్టుగా ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు బీ టౌన్ జ‌నాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news