Moviesబాల‌య్యకు ఆ హీరోయిన్‌తో ఎమోష‌న‌ల్ లింక్‌... !

బాల‌య్యకు ఆ హీరోయిన్‌తో ఎమోష‌న‌ల్ లింక్‌… !

బాలయ్య బాబు అరవై ఏళ్ల వయసు దాటినా కూడా కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తూ స్పీడ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అఖండ త‌ర్వాత గ‌ర్జిస్తోన్న బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్ వ‌చ్చిన వెంట‌నే బ‌జ్ డ‌బుల్ అయిపోయింది. మ‌లినేనీ గోపీ సినిమా ద‌స‌రాకు లేదా డిసెంబ‌ర్లో అయితే రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నాడు.

అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ఆరు వ‌రుస హిట్ల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. పైగా బాల‌య్య‌ను ఎప్ప‌టి నుంచో డైరెక్ట్ చేయాల‌ని కసితో ఉన్నాడు. గ‌తంలోనే వీరి కాంబోలో రామారావు గారు అనే టైటిల్‌తో సినిమా ప‌ట్టాలు ఎక్కాల్సి ఉన్నా వాయిదా ప‌డింది. ఇక ఇప్పుడు ఎట్ట‌కేల‌కు ఈ సినిమా సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ మీద‌కు వెళుతోంది. హీరోయిన్‌గా ప్రియ‌మ‌ణి పేరు అనుకుంటున్నారు. ప్రియ‌మ‌ణి బాల‌య్య‌కు జోడీ క‌డితే యంగ్ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య‌కు కూతురు పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

50 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన పాత్ర‌లో బాల‌య్య న‌టించ‌నున్నారు. బాల‌య్య‌కు కూతురుగా శ్రీలీల న‌టిస్తోంది. అటు అనిల్ రావిపూడి స్టైల్లో కామెడీ, ఇటు బాల‌య్య స్టైల్ యాక్ష‌న్ క‌ల‌బోత‌తో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్‌, బిగ్‌బాస్ ఫేం బిందుమాధ‌వి కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి స్వ‌యంగా ఆమెకు ఈ సినిమాలో న‌టించే ఆఫ‌ర్ ఇచ్చారు.

ఈ సినిమాలో బాల‌య్య‌కు, బింధుమాధ‌వికి మ‌ధ్య సెంటిమెంట్ సీన్లు ఉంటాయ‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లే సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయ‌ని కూడా తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇటు బింధు మాధ‌వితో పాటు అటు శ్రీలీలతో కూడా అదిరిపోయే ఎమోష‌న‌ల్ సీన్లు ఉండేలా అనిల్ ప్లాన్ చేశార‌ట‌. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news