Moviesఅభిమానులకు బిగ్ షాకిచ్చిన సమంత..ఇప్పుడు కధలో అసలైన మజా అంటే..!

అభిమానులకు బిగ్ షాకిచ్చిన సమంత..ఇప్పుడు కధలో అసలైన మజా అంటే..!

వామ్మో..సమంత ఇలాంటి పాత్రలోనా…వినడానికే ఒక విధంగా అనిపిస్తుంది అంటున్నారు ఆమె అభిమానులు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న.. ఈ భామ, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకుని..ఫుల్ ఫాంలో ఉంది. అంతక ముందు సమంత స్టార్ హీరోయిన్ గా ఉండేది..కానీ, అప్పుడు అక్కినేని వారి ఇంటి కోడలుగా చూసేవారు. కానీ, ఇప్పుడు సమంత సింగిల్..ఆమె ఆడిందే ఆట..పాడిందే పాట. తప్పుపట్టడానికి లేదు..ప్రశ్నించడానికి లేదు..నచ్చిన్నట్లు ఉంటూ ఇష్టం వచ్చిన్నట్లు చేస్తుంది.

కాగా, భర్త నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సమంత జెట్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఢిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ..సక్సెస్..ఫెయిల్యూర్ అంటూ తేడా లేకుండా..టాప్ పొజీషన్ లో ఉంది. అయితే, ప్రజెంట్ సమంత చేసిన యశోద సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. శాకుంతలం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరు చెప్పలేం అన్న పోజీషన్ లో ఉంది. మరో పక్క కొత్త సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతుంది.

శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషీ సినిమా చేస్తున్న సమంత..తాజాగా మరో సినిమాకి ఓకె చేసిన్నట్లు తెలుస్తుంది. అయితే, ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..సమంత చేయబోయేది విలన్ గా అంటూ ఓ క్రేజీ రూమర్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. కోలీవుడ్‌లో హీరో విజయ్‌కు ఉన్న స్టార్‌డం అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వస్తాయి. ప్రస్తుతం ఈయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా..వారీసు.

తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది . దీని తర్వాత లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు విజయ్. ఈ సినిమాలో సమంత ..విలన్ రోల్ నతీంచనున్నట్లు తెలుస్తుంది. నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో సమంత చేయడం ఇదే మొదటిసారి. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు మాస్టర్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కానీ, సమంత విలన్ గా..విజయ్ హీరోగా అంటే ఆ కిక్కే వేరు..అంటున్నారు అభిమానులు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. నాగచైతన్య కూడా ధూత అంటూ వస్తున్న వెబ్ సిరీస్ లో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news