Moviesవారెవ్వా..స్టార్ హీరో కుమారుడితో బిందు మాధవి రొమాన్స్.. జాక్ పాట్ కొట్టిందిగా..?

వారెవ్వా..స్టార్ హీరో కుమారుడితో బిందు మాధవి రొమాన్స్.. జాక్ పాట్ కొట్టిందిగా..?

బిందు మాధవి ఈ పేరు కు కొత్తగా పరిచయం అవసరం లేదు. ముందు హీరోయిన్ గా తన సినీ కెర్రిర్ ప్రారంభించిన ఈ బ్యూటీ..పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏవో చిన్న చితకా సినిమాలు చేసినా..అందం పరంగా ఓకే కానీ నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తరువాత కొనాళ్ళు గ్యాప్ తీసుకుని..తమిళ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చి..మంచి మంచి సినిమాలు చేస్తూ లైన్లో పడ్డింది. కోలీవుడ్ కుర్రాళ్ళను తన అందచందాలతో మెప్పించింది.

ఇక ఆ క్రేజ్ తోనే తమిళ బిగ్ బాస్ లో..అవకాశం కొట్టేసింది. బిగ్ బాస్ లో తన దైన స్టైల్ లో ఆడుతూ అందరి అటెన్షన్ గ్రాబ్ చేసుకుని ..టాప్ 4 వరకు వచ్చింది. తమిళ బిగ్ బాస్ లో అమ్మడు ఆడిన తీరు చూసి.. తెలుగు బిగ్ బాస్ OTT లో ఆఫర్ దక్కించుకుంది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే అందరి ఊహలను తలకిందులు చేస్తూ..మిగతా కంటెస్టెంట్లను రప్ఫాడించింది. అబ్బో ..అమ్మడి ఆట తీరు కి బయట చాలా మందే అభిమానులు ఉన్నారు. అంతేకాదండోయ్..అమ్మడు కి ఏకంగా ఆడపులి అంటూ బిరుదు కూడా ఇచ్చారు.


ఫైనల్లీ..అందరిని మెప్పించి..టాప్ ప్లేస్ లో ఓటింగ్ దక్కించుకుని..ట్రోఫీ అందుకుంది. ఇక అమ్మడు ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా మళ్లీ అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రెండు తమిళ ప్రాజెక్ట్స్ ని కూడా లైన్లో పెట్టిందట. కాగా, రీసెంట్ గా మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన్నట్లు..తెలుస్తుంది.

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ సినిమాలో హీరోయిన్‌గా బింది మాధవికి నటించే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇది మామూలు ఆఫర్ కాదు. ఒక్కవేళ ప్రణవ్ మోహన్ లాల్ సినిమా హిట్ అయితే మాత్రం బిందు మాధవికి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్‌లు వస్తాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాని అందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news