Moviesఊహించ‌ని షాక్‌... తాను ప్రెగ్నెంట్ అని క‌న్‌ఫార్మ్ చేసిన రెజీనా..!

ఊహించ‌ని షాక్‌… తాను ప్రెగ్నెంట్ అని క‌న్‌ఫార్మ్ చేసిన రెజీనా..!

సుధీర్‌బాబు న‌టించిన ఎస్ ఎం ఎస్ ( శివ మ‌న‌సులో శృతి) సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్గా ప‌రిచ‌యం అయ్యింది బ‌క్క‌ప‌ల్చ‌ని భామ రెజీనా. ఆ త‌ర్వాత తెలుగులో చిన్న చిన్న సినిమాలు చేస్తూ టైర్ 2 హీరోల ప‌క్క‌న కొన్ని సినిమాల్లో న‌టించింది. మంచి ప‌ర్స‌నాలిటీ, న‌ట‌న ఉన్నా కూడా ఆమెకు ఎందుకో స్టార్ హీరోల సినిమాల్లో అయితే ఛాన్సులు రాలేదు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, సందీప్‌కిష‌న్, ర‌వితేజ లాంటి వాళ్ల‌తోనే ఆమె స‌రిపెట్టేసుకుంది.

ప్రస్తుతం తెలుగులో స‌రైన ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో ఇత‌ర భాష‌ల సినిమాల్లో ట్రై చేస్తోంది. వీలున్న‌ప్పుడ‌ల్లా బుల్లితెర మీద ఏదో ఒక షోలో సంద‌డి చేస్తూ వ‌స్తోంది. తాజాగా తెలుగులో ఓ వెబ్‌సీరిస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రెజీనా ఆ వెబ్‌సీరిస్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఆలీతో జ‌రిగిన షోకు వ‌చ్చింది. ఈ షోలో ప్రోమోతోనే అంద‌రిని ఎట్రాక్ట్ చేసిన ఈ అమ్మ‌డు షోలో చాలా విష‌యాలే చెప్పుకువ‌చ్చింది.

ఈ క్ర‌మంలోనే ఈ షోలో తాను ప్రెగ్నెంట్ అంటూ ఎవ్వ‌రూ ఊహించ‌ని విష‌యాన్ని రివీల్ చేసింది. అయితే ఆమె చెప్పింది అంద‌మైన అబ‌ద్ధం. అస‌లు విష‌యంలోకి వెళితే రెజీనాకు మిస్టీ దోయ్ స్వీట్ అంటే ఎంతో ఇష్టం అట‌. ఓ రోజు రాత్రి వేళ 11 గంట‌ల టైంలో ఆమె ఆ స్వీట్ కొనేందుకు బ‌య‌ట‌కు వెళ్లింద‌ట‌. అప్ప‌టికే ఆ షాప్ వాడు షాపును క్లోజ్ చేస్తూ ఉన్నాడ‌ట‌. రెజీనా ఆ స్వీట్ ఇవ్వ‌మ‌ని అడిగితే కుద‌ర‌ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేశాడ‌ట‌.

వెంట‌నే రెజీనా తాను ప్రెగ్నెంట్ అని.. త‌న‌కు ఆ స్వీట్ తినాల‌ని ఉంద‌ని చెప్ప‌డంతో ఆ షాప్ మూసేసిన వ్య‌క్తి వెంట‌నే షాప్ ఓపెన్ చేసి ఆమెకు ఆ స్వీట్ బాక్సు ఇచ్చాడ‌ట‌. ఇలా ఆ స్వీట్ తినేందుకు తాను గ‌ర్భ‌వ‌తిని అని అబ‌ద్ధం చెప్పాన‌ని రెజీనా ఆ షోలో చెప్పింది. ఇక రెజీనా మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఏకంగా మూడు సినిమాలు చేసింది.

సాయి ఫ‌స్ట్ సినిమా పిల్లానువ్వులేని జీవితం సినిమాతో పాటు సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్‌సేల్ ఆ త‌ర్వాత న‌క్ష‌త్రం సినిమాలోనూ న‌టించింది. ఈ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌, పెళ్లి అంటూ పుకార్లు వ‌చ్చాయి. త‌ర్వాత అవి సైలెంట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఎవ‌రి దారుల్లో వారు బిజీగా ఉన్నారు. యాక్సిడెంట్ త‌ర్వాత కాస్త కోలుకున్న సాయి ఇప్పుడే త‌న సినిమాల‌పై కాన్‌సంట్రేస‌న్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news