Moviesబాలయ్య అన్ స్టాపబుల్ 2పై అదిరే అప్‌డేట్‌... చిరుతో న‌ట‌సింహం ముచ్చ‌ట్లు...

బాలయ్య అన్ స్టాపబుల్ 2పై అదిరే అప్‌డేట్‌… చిరుతో న‌ట‌సింహం ముచ్చ‌ట్లు ఎప్పుడంటే..!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా మారి చేసిన టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. మెగా కాంపౌండ్‌కు చెందిన అల్లు అర‌వింద్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఫ‌స్ట్ సీజ‌న్ ఎపిసోడ్లు అన్నీ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు అయ్యాయి. అస‌లు బాల‌య్య ఇంత స్పాంటేనియ‌స్‌గా ఈ టాక్ షోను హోస్ట్ చేస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. బాల‌య్య అంటేనే ఎన‌ర్జీకి మారుపేరు. అన్‌స్టాప‌బుల్ షోతో బాల‌య్య ఎన‌ర్జీ ఆరు ప‌దుల వ‌య‌స్సులోనూ మ‌రింత పెరిగింద‌ని ఫ్రూవ్ అయ్యింది.

అస‌లు ఈ షో వ‌ల్లే సోష‌ల్ మీడియాలో బాల‌య్య‌పై పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవ్వ‌డంతో పాటు ఆయ‌న ఈ త‌రం జ‌న‌రేష‌న్లో బాగా పాపుల‌ర్ అయ్యాడు. మ‌హేష్ – రవితేజ – బ‌న్నీ – మోహ‌న్‌బాబు లాంటి వాళ్ల‌ను బాల‌య్య ప్ర‌శ్న‌లు అడిగిన తీరుకు.. వాళ్ల‌ను నొప్పించ‌కుండానే ఆన్స‌ర్లు రాబ‌ట్టిన తీరుకు ప్ర‌తిఒక్క‌రు ఫిదా అయిపోయారు. అయితే ఫ‌స్ట్ సీజ‌న్ స‌క్సెస్‌ఫుల్‌గా ముగిసిన వెంటేనే ఆహా ప్లాట్‌ఫామ్‌కు మామూలు పేరు రాలేదు. స‌బ్‌స్క్రైబ‌ర్లు కూడా విప‌రీతంగా పెరిగిపోయారు.

దీంతో ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్ ఎప్పుడు ఉంటుందా ? అని కేవ‌లం బాల‌య్య అభిమానులు మాత్ర‌మే కాదు.. బుల్లితెర అభిమానులు అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. ఇటు ఆహా యాజ‌మాన్యం కూడా త్వ‌ర‌లోనే అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా ఈ షోపై మ‌రో అప్‌డేట్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు చివ‌రి వారం నుంచి ఈ రెండో సీజ‌న్ గ్రాండ్‌గా స్టార్ట్ అవుతోంది.

ఆగ‌స్టు ఎండింగ్‌కు బాల‌య్య మ‌లినేని గోపీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఎన్బీకే 107 సినిమాను ఫినిష్ చేస్తాడు. అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌మీద‌కు వెళ్లే గ్యాప్‌లో అన్‌స్టాప‌బుల్ రెండో సీజ‌న్‌కు సంబంధించి మూడు, నాలుగు ఎపిసోడ్లు ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండో సీజ‌న్‌కే మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నుంది. చిరు ఎపిసోడ్ అయితే ఫ‌స్ట్ ఎపిసోడ్ లేదా.. సెకండ్ సీజ‌న్లో చివ‌రి ఎపిసోడ్‌గా వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్ ఎప్పుడో తాను ఈ షోకు వ‌స్తాన‌ని బాల‌య్య‌కు హామీ ఇచ్చి ఉన్నాడు. వెంకీ ఎపిసోడ్ కూడా ఈ రెండో సీజ‌న్లోనే ఉండ‌నుంది. అలాగే బాల‌య్య అంటే అభిమానం చూపించే మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, కొంద‌రు హీరోయిన్ల‌తో కూడా బాల‌య్య టాక్ షో ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. బాల‌య్య 107 సినిమా రిలీజ్‌కు ముందే రెండు, మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యేలా చూస్తున్నారు. ఏదేమైనా మ‌ళ్లీ బుల్లితెర‌పై బాల‌య్య సంద‌డి అయితే మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news