Moviesదిల్ రాజు కొడుకు పేరు ఇదే.. ఇంత సెంటిమెంట్ మిక్స్ చేశారా...!

దిల్ రాజు కొడుకు పేరు ఇదే.. ఇంత సెంటిమెంట్ మిక్స్ చేశారా…!

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఇటీవ‌లే వార‌సుడు పుట్టిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు మొద‌టి భార్య అనిత నాలుగేళ్ల క్రిత‌మే మృతిచెందారు. దీంతో రాజు కుమార్తె ప‌ట్టుబ‌ట్టి త‌న తండ్రికి ఈ వ‌య‌స్సులో తోడు ఉండాల‌ని తానే స్వ‌యంగా ఓ అమ్మాయిని చూసి మ‌రీ ద‌గ్గ‌రుండి త‌న తండ్రికి రెండో పెళ్లి చేసింది. క‌రోనా లాక్‌డౌన్ టైంలో దిల్ రాజు సొంత ఊరు అయిన నిజామాబాద్ జిల్లాలో కొద్దిమంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ పెళ్లి జ‌రిగింది.

వ‌య‌స్సు ప‌రంగా కూడా దిల్ రాజుకు, ఆయ‌న రెండో భార్య‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాస‌మే ఉంది. రాజు వ‌య‌స్సు 50 + ఉండ‌గా.. ఆయ‌న రెండో భార్య వ‌య‌స్సు జ‌స్ట్ 30 +. అయితే ఈ దంప‌తుల‌కు రీసెంట్‌గా వార‌సుడు జ‌న్మించాడు. మొద‌టి భార్య ద్వారా రాజుకు ఒక్క కుమార్తె మాత్ర‌మే ఉండ‌గా.. ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది. వార‌సుడు లేడ‌న్న కోరిక రాజుకు రెండో భార్యకు పుట్టిన బిడ్డ ద్వారా తీరింది.

 

ఇక రాజు వార‌సుడికి అప్పుడే పేరు పెట్టిన‌ట్టు కూడా తెలుస్తోంది. ఈ పేరు వెన‌క చాలా సెంటిమెంట్ కూడా ఫాలో అయ్యార‌ట‌. రాజు కొడుక్కి అన్వైరెడ్డి పేరు పెట్టార‌ట‌. దీనినే మ‌రోలా అన్వ‌య్ రెడ్డి అని కూడా పిల‌వ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ పేరులో త‌న ఇద్ద‌రు భార్య‌ల పేర్లు వ‌చ్చేలా సెంటిమెంట్‌ను మిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

రాజుకు మొద‌టి భార్య అనిత అంటే ఎంతో ప్రేమ‌. రాజు బ్యాన‌ర్ అయిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌లో వ‌చ్చిన అన్ని సినిమాల‌కు.. ఇప్పుడు కూడా ఆమే స‌మ‌ర్ప‌కురాలిగా ఉన్నారు. అనిత పేరులో ముందు అక్ష‌రం, ఇటు రెండో భార్య వైఘ‌రెడ్డి ( ఈ రెండో భార్య‌కే తేజ‌స్విని అనే మ‌రో పేరు కూడా ఉందంటున్నారు ). ఈ ఇద్ద‌రు భార్య‌ల పేర్ల‌లోని అక్ష‌రాలు క‌లిసి వ‌చ్చేలా అన్వై రెడ్డి అని రాజు వార‌సుడికి నామ‌క‌ర‌ణం చేశార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news