Moviesకష్టం ఒకరిది..సుఖం మరోకరిది..పూరీ జాతకం ఎంత దరిద్రంగా ఉందంటే..?

కష్టం ఒకరిది..సుఖం మరోకరిది..పూరీ జాతకం ఎంత దరిద్రంగా ఉందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాధ్ అంటే అదో రకమైన ఇది. మామూలు ఇది కాదు..అబ్బో..అదో పెద్ద చరిత్రే. కనీసం డైలాగ్ లు కూడా చెప్పని..చేతకానీ..హీరోలందరిని స్టార్ హీరోలుగా మార్చిన ఘనత పూరీ జగన్నాధ్ ది. ఈ విషయాని కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్..మొన్న ఈ మధ్య ఓ ఫంక్షన్ లో నేరుగా నే చెప్పేశాడు.

అంతేనా, అస్సలు తిట్టారో, పొగిడారో..లేదా కావాలనే బుక్ చేసారో తెలియదు కానీ, మనసులో ఉన్న కోపాని అంతా బయటపెట్టేసి అన్నా , వదినా అంటూ అడగాల్సిన నాలుగు మాటలు అడిగి కడిగి పడేశాడు. ఏదో కొడుకు సినీ కెరీర్ కి ఈ బండ్ల ప్లస్ అవుతాడు అనుకుంటే.. పూరీ పరువును నిలువునా తీసేశాడు . దీంతో కొన్ని రోజులు పూరీ గత గాసిప్స్ , ఎఫైర్స్ బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషయం కారణంగా పూరీ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు . మనకు తెలిసిందే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా “లైగర్”. ఈ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. మొన్న రిలీజ్ అయిన న్యూడ్ పోస్టర్ మరింత అంచనాలను పెంచేసింది.

అయితే, ఈ సినిమా హిట్ అయినా..ఆ క్రెడిట్ అంతా కూడా విజయ్ ఎగరేసుకునిపోతాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా ఖచ్చితం గా విజయం సాధిస్తుందని ..కానీ, పూరీ కి మాత్రం ఆ సక్సెస్ తాలుకా గుర్తింపు రాదని..మొత్తం క్రెడిట్ విజయ్ ఖాతాలోనే పడుతుందని..అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక్కవేళ బెడిసికొడితే..ఆ నింద ఖచ్చితంగా పూరికే వెళ్తుందట. అలా ఉండి పాపం పూరీ జాతకం అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news