Moviesమీనాకు భ‌ర్త‌తో విబేధాలు.. షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన సీనియ‌ర్ న‌టి..!

మీనాకు భ‌ర్త‌తో విబేధాలు.. షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన సీనియ‌ర్ న‌టి..!

సీనియ‌ర్ న‌టి మీనా తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీల‌ను ప‌దేళ్ల‌కు పైగా ఏలేసింది. బాల‌న‌టిగానే కెరీర్ స్టార్ట్ చేసిన మీనా ఆ త‌ర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సౌత్‌లో అంద‌రు స్టార్ హీరోల ప‌క్క‌నా న‌టించి సూప‌ర్ హిట్లు కొట్టింది. హోమ్లీ క్యారెక్ట‌ర్ల‌కు మీనా కేరాఫ్‌. కెరీర్ ఫేడ‌వుట్ అయినా కూడా చాలా రోజుల పాటు పెళ్లికి దూరంగా ఉన్న మీనా నాలుగు ప‌దుల వ‌య‌స్సులో 2009లో బెంగ‌ళూరుకు చెందిన ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ విద్యాసాగ‌ర్‌ను పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్నాక కూడా మీనా సినిమాలు చేస్తోంది. ఇక మీనా – విద్యాసాగ‌ర్ దంప‌తుల‌కు నైనిక అనే కుమార్తె కూడా ఉంది. ఈ నైనికే విజ‌య్ తెరీ సినిమా ( తెలుగులో పోలీసోడు)లో కూడా న‌టించింది. ఇక తాజాగా విద్యాసాగ‌ర్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్ సోకి హ‌ఠాత్తుగా మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. విద్యాసాగ‌ర్ మృతికి పావురాలు కూడా కార‌ణ‌మే అని.. పావురాల వ్య‌ర్థాల కార‌ణంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్ష‌న్ సోకి .. కోవిడ్ త‌ర్వాత అది తీవ్ర‌మై మృతి చెందాడ‌ని కూడా క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే మీనా – విద్యాసాగ‌ర్ దంప‌తుల‌పై సీనియ‌ర్ న‌టిమ‌ణి కుట్టి ప‌ద్మిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కుట్టి ప‌ద్మిని కూడా బాల‌న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసి త‌మిళంలో మంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మీనాతో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. గ‌త కొంత కాలంగా మీనాకు, విద్యాసాగ‌ర్‌కు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తీవ్రంగా ఉన్నాయ‌ని.. వాళ్లిద్ద‌రు వేర్వేరుగానే ఉంటున్నార‌న్న విష‌యం త‌న‌కు వ‌ర‌కు వ‌చ్చింద‌ని కుట్టి ప‌ద్మిని చెప్పింది.మీనా త‌న కుమార్తెతో క‌లిసి చెన్నైలో ఉంటుంటే.. విద్యాసాగ‌ర్ బెంగ‌ళూరులో ఉండేవాడ‌ని చెప్పిది.

మీనాకు దూరంగా ఒంట‌రిగా ఉంటోన్న క్ర‌మంలోనే విద్యాసాగ‌ర్ పావురాల‌తో ఆడుకునేవాడ‌ని.. ఈ కార‌ణంగానే లంగ్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చి హ‌ఠాత్తుగా చ‌నిపోయాడ‌ని చెప్పిందన్న విష‌యం త‌న‌తో ఎంతో మంది చెప్పార‌ని తెలిపింది. ఇక ఇప్పుడు భ‌ర్త లేక‌పోవ‌డంతో మీనా జీవితం ఇబ్బందుల్లో ప‌డింద‌ని.. భ‌ర్త లేక‌పోవ‌డంతో మీనా త‌న కుమార్తెను ఒక్క‌టే చూసుకోవాల్సిన ఇబ్బందిక‌ర ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. ఈ క్లిష్ట స‌మ‌యంలో ఆమెకు ఆ భ‌గ‌వంతుడు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news