ReviewsTL రివ్యూ: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

TL రివ్యూ: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

న‌టీనటులు: గోపీచంద్-రాశి ఖన్నా-సత్యరాజ్-రావు రమేష్-ప్రవీణ్-శియ గౌతమ్
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్ర‌ఫీ: కర్మ్ చావ్లా
నిర్మాత: బన్నీ వాసు
దర్శకత్వం: మారుతి
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రిలీజ్ డేట్‌: 1 జూలై, 2022

కామెడీ ఎంట‌ర్టైనర్ల‌కు పెట్టింది పేరు అయిన మారుతి, యాక్ష‌న్ హీరో గోపీచంద్ కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. జీఏ 2 బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ల‌తో రిలీజ్‌కు ముందే ప్రామీసింగ్‌గా అనిపించింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా ఉందో లేదో చూద్దాం.

కథ:
త‌న తీర్పు కార‌ణంగా ఓ అమాయ‌కురాలు ప్రాణం పోయింద‌న్న బాధ‌తో ఓ జ‌డ్జి సూర్య‌నారాయ‌ణ ( స‌త్య‌రాజ్‌) త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి కిరాణా కొట్టు న‌డుపుతూ ఉంటాడు. అత‌డి కొడుకు లక్కీ (గోపీచంద్) తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ లాయర్ అవుతాడు. అయితే తండ్రికి రివ‌ర్స్‌గా నేర‌స్తుల త‌ర‌పున వాదిస్తుంటాడు. త‌న తండ్రి ప‌ద‌వి వదులుకోవ‌డానికి కార‌ణ‌మైన వివేక్ ( రావు ర‌మేష్ ) చెంత చేర‌తాడు. ఈ విష‌యం తెలుసుకున్న జ‌డ్జి సూర్య‌నారాయ‌ణ వివేక్ బాధితుల ప‌క్షాన వాదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ తండ్రి కొడుకుల పోరులో విజేత ఎవ‌రు ? ఈ పోరాటంలో చివ‌రికి ఏం జ‌రిగింది ? హీరోయిన్ అయిన లాయ‌ర్ ఝాన్సీ రోల్ ఏంటి అన్న‌దే ఈ సినిమా.

విశ్లేష‌ణ :
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ను ముందుగా లాజిక్ అనేది ప‌క్క‌న పెట్టేసి చూడాలి. క‌థ‌ను సీరియ‌స్‌గా చెప్పాల్సిన చోట కూడా కామెడీతో కిచిడీ చేసేశారు. ఆ కామెడీ కూడా అనుకున్న రేంజ్‌లో అయితే వ‌ర్క‌వుట్ కాలేదు. నెగిటివ్ షేట్స్ ఉన్న హీరో చివ‌ర్లో మంచి ల‌క్ష్యం కోసం ప‌నిచేసిన‌ట్టు తెలియ‌డ‌మే ఈ సినిమా స్టోరీ. ఇది ఎప్పుడో చూసేసిన స‌గ‌టు రివేంజ్ స్టోరీయే. మారుతి మార్క్ కామెడీ సీన్లు, గోపీచంద్ మార్క్ యాక్ష‌న్‌సీన్లు మిక్స్ చేసిన సినిమాయే ఇది. బాగా క‌మ‌ర్షియ‌ల్‌గా మారిన కొడుకు అయిన లాయ‌ర్ కోసం 25 ఏళ్ల త‌ర్వాత తండ్రి లాయ‌ర్ కోటు వేసుకున్నాడంటే తండ్రి, కొడుకుల మ‌ధ్య ర‌స‌వత్త‌ర‌మైన పోరు ఉండాలి. కానీ ఆ అంచ‌నాలు ఇక్క‌డ త‌ప్పాయ్‌.

తండ్రి కొడుకును ఢీ కొడుతూ బ‌లంగా వాదించే కోర్టు సీన్ ఒక్క‌టి కూడా లేదు. ఒక ద‌శ‌లో చికాకు వ‌చ్చినా చివ‌రి 30 నిమిషాలు మాత్రం ఎంగేజ్ చేయ‌డంతో ప్రేక్ష‌కుడు కాస్త శాటిస్‌పై అవుతూ బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఇదే సినిమాకు పెద్ద రిలీఫ్‌. సీరియ‌ల్ న‌టిగా చేసిన హీరోయిన్ ఝాన్సీ ఎంట్రీతో కామెడీ అయితే డ‌బుల్ అవుతుంది. ఫ‌స్టాఫ్ అంతా రోటీన్ కామెడీతో న‌డిచి సెకండాఫ్‌లో అస‌లు క‌థ‌లోకి ఎంట‌ర్ అవుతుంది.

డ‌బ్బుకోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే లాయ‌ర్ ల‌క్కీ పాత్ర‌లో గోపీచంద్ అలా సెట్ అయ్యాడు. ల‌క్ష్యం, లౌక్యం త‌ర్వాత ఆ రేంజ్‌లో కామెడీ పండించాడు. సీరియ‌ల్ హీరోయిన్ లాయ‌ర్ ఝాన్సీగా రాశీఖ‌న్నా పాత్ర బాగుంది. సీరియ‌ల్ భాష‌లో ఆమె చెప్పే డైలాగులు పండాయి. హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్‌ జీవించేశాడు. వివేక్ అనే విల‌న్ పాత్ర‌లో రావూ ర‌మేష్‌కు త‌న అల‌వాటైన పాత్రే చేసేశాడు. టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్ అన్ని బాగా కుదిరాయి. అయితే రైటింగ్ డిపార్ట్‌మెంట్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు. ఓవ‌రాల్‌గా య‌బో యావ‌రేజ్ అనిపించే సినిమా.

ఫైన‌ల్ పంచ్ : పక్కా హాఫ్ క‌మ‌ర్షియ‌ల్‌

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ TL రేటింగ్ : 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news