Moviesబాల‌య్య కొత్త సినిమాలోనూ ' జై బాల‌య్యా ' సాంగ్‌... ఈ...

బాల‌య్య కొత్త సినిమాలోనూ ‘ జై బాల‌య్యా ‘ సాంగ్‌… ఈ సారి డిఫ‌రెంట్‌గా….!

క‌రోనా భ‌యంతో అస‌లు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా ? రారా ? అన్న సందేహాల‌ను అఖండ ప‌టాపంచ‌లు చేసి ప‌డేసింది. అఖండ అఖండ‌మైన విజ‌యంతో ప్రేక్ష‌కుల‌తో పాటు సినిమా ఇండ‌స్ట్రీకే ఉన్న భ‌యం అంతా పోగొట్టేసింది. అఖండ కొండంత ధైర్యం ఇచ్చింద‌నే చెప్పాలి. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తోనే ఇండ‌స్ట్రీ జ‌నాలు అంతా ధైర్యంగా త‌మ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఇప్పుడు బాల‌య్య క్రాక్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో తన 107వ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

టాలీవుడ్‌లోనే క్రేజీ బ్యాన‌ర్ల‌లో ఒక‌టిగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా… ఈ సినిమాలో కూడా బాల‌య్య త‌న‌కు క‌లిసొచ్చిన డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్ర‌లు రెండు డైమ‌న్ష‌న్ల‌లో ఉంటాయంటున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఫ‌స్ట్ హంట్ టీజ‌ర్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేసింది.

మైనింగ్ క్వారీల్లో లుంగీ క‌ట్టుకుని సాల్ట్ & పెప్ప‌ర్ లుక్‌లో బాల‌య్య ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. ఈ లుక్ సినిమాపై హైఫ్ క్రియేట్ చేసింది. ఇటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ సినిమా గురించి పాజిటివ్ వైబ్స్ వ‌చ్చేశాయి. ఈ సినిమాలో కూడా అఖండ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. అఖండ సినిమాలో జై బాల‌య్యా సాంగ్ అదిరిపోయింది. ఈ సాంగ్ సినిమా విజ‌యంలో కీల‌క‌మైంది.

మాస్‌ను ఈ సాంగ్ ఊపేసింది. ఇప్పుడు ఇదే జై బాల‌య్య సెంటిమెంట్‌ను మ‌లినేని గోపీచంద్ సినిమాకు కూడా యాడ్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాలోనూ జై బాల‌య్య అన్న ప‌ల్ల‌వితోనే సాంగ్ స్టార్ట్ అవుతుంది అట‌. అయితే ఇది మాస్ బీట్‌లా కాకుండా… బాల‌య్య గొప్ప‌త‌నం చెప్పేలా ఉంటుంద‌ని తెలుస్తోంది. రాయ‌ల‌సీమ‌లో ఓ ప‌ల్లెలో జ‌నాలు బాల‌య్య‌ను పొగుడుతూ ఈ పాట పాడ‌తార‌ట‌.

శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాకు జై బాల‌య్య టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అన్ని అనుకున్న‌ట్టుగా పూర్త‌యితే ద‌స‌రాకు ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news