Moviesచైతన్య చాలా మంచోడు..250 కోట్ల భరణం..ఫస్ట్ టైం నోరు విప్పిన సమంత..!!

చైతన్య చాలా మంచోడు..250 కోట్ల భరణం..ఫస్ట్ టైం నోరు విప్పిన సమంత..!!

సమంత చైతన్య డివర్స్ తీసుకుని పది నెలలు కావస్తున్నా..ఇంకా ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. సోషల్ మీడీయాలో దీనికి సంబంధించి రోజుకో మ్యాటర్ నెట్టింట టాప్ లేపుతున్నా..అటు చైతన్య కానీ, ఇటు సమంత కానీ..ఎవ్వరు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడెప్పుడో నాగ చైతన్య ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..”విడిపోయి ఇద్దరు హ్యాపీ గానే ఉన్నాం “అని తప్పిస్తే..ఇప్పటి వరకు ఓ చిన్న మాట కూడా మాట్లాడలేదు.

అయితే, ఫస్ట్ టైం తన విడాకుల పై స్పందించింది సమంత. కాఫీ విత్ కరణ్ షో లో గెస్ట్ గా పాల్గోన్న ఈమె..హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు ఓపెన్ గా సమాధానాలు ఇచ్చి..షాక్ ఇచ్చింది. హోస్ట్ కరణ్..భర్త తో విడాకులు తీసుకున్న తరువాత మీ లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా..సమంత మాట్లాడుతూ..” చాలా బాధగా అనిపించింది. నా జీవితంలో చాలా విషయాలను చెప్పి నేను చైతన్య తో విడిపోయాను”..అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా సమంత మాట్లాడుతూ..”విడాకుల తరువాత నా జీవితం గందరగోళంగా మారిపోయింది. చాలా కష్టంగా మారింది . కాని, ఏ సమయంలోను నేను కృంగిపోలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా. నాగచైతన్య తో విడిపోవడం అంత కూల్ గా ఏం జరగలేదు..ఎన్నొ ఇబ్బందులు పడ్డాను. విడిపోయిన తరువాత తాను చాలా మనోవేదనకు గురైయాను. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడను. ఎందుకంటే..వాళ్లు వచ్చి నాకు తిండి పెట్టరు..నా బాగోగులు చూసుకోరు..మరి నేను ఎందుకు వాటిని సీరియస్ గా తీసుకోవాలి..ఇక, భరణం గురించి అంటారా..సోషల్ మీడియాలో నేను 250 కోట్లు భరణంగా తీసుకున్నాను అని వార్తలు వస్తున్నాయి.

అవి నిజం కాదు. అది వాళ్లకి తెలుసు. అందుకే ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యాయో ఆ వార్తలు..అంత ఫాస్ట్ గా తుడుచుకుపోయాయి..”అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే, విడాకులు తీసుకోక ముందు ఇంటర్వ్యుల్లో వరకు..సమంత ఏ ఇంటర్వ్యుకి వెళ్లిన చై మంచోడు..నా భర్త బంగారం ..అంటూ చెప్పుకొచ్చేది. కానీ, ఇప్పుడు ఆ బంగారమే నచ్చడం లేదు ..ఏంటో ఈ కలియుగ మాయ..ఇంకా ఎన్నెన్ని చూడాలో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news