Moviesఇండస్ట్రీలో ఒక్క మగాడు వాడే.. మరి మిగిలిన హీరోలు..?

ఇండస్ట్రీలో ఒక్క మగాడు వాడే.. మరి మిగిలిన హీరోలు..?

విజయ్ దేవరకొండ ఒక్కడే ఇండస్ట్రీలో కి కష్టపడి వచ్చి..హీరో అయ్యాడా..? మిగిలిన హీరోలు అలా రాలేదా..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు సమంత ని మిగతా హీరోల అభిమానులు. సమంత రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షో లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య ని భర్త అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడని సామ్..వాళ్ళ ఇద్దరిని ఒక్కే రూమ్ లో పెడితే,, వాళ్లతో పాటు పదునైన సామాన్లు కూడా పెట్టాలని..నాగ చైతన్య పై ఉండే కొపాని పరోక్షంగా చూయించింది. ఇంకా నెపొటిజం గురించి మాట్లాడుతూ..స్టార్స్ సన్స్ పై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్ చేసింది.

ఒక కోచ్ అయిన తండ్రి తన పిల్లవాడు ఆడుతుంటే దగ్గర ఉండి చూడగలడే కానీ, గెలిపించలేడు. అది తన టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అంతే ఎంత గొప్ప స్టార్ హీరో కొడుకులు అయినా..టాలెంట్ ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే పట్టించుకోరు…అంటూ ఘాటుగా స్పందించింది. పనిలో పని,..విజయ్ దేవరకొండ ను కూడా పొగిడేసింది. అందరు హీరోలు విజయ్ దేవరకొండలా ఉండలేరు. హీ ఈజ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అంటు ఆకాశానికి ఎత్తేసింది. దీంతో మిగత హీరో అభిమానులకు మండిపోతుంది. ఇండస్ట్రీలో కి టాలెంట్ తో వచ్చిన నటులు చాలా మందే ఉన్నారు.

మీ ఒక్క దేవరకొండ మాత్రమే కాదు. రవితేజ్, నాని, రాజ్ తరుణ్,..ఇలా చాలా మంది హీరోలు సొంత టాలెంట్ తోనే వచ్చారు..అంటూ సమంత ను ఏకిపారేస్తున్నారు. కాగా, సమంత విజయ్ ఇది వరకే మహానటి సినిమాలో కలిసి నటించారు. ఇక ఇప్పుడు ఖుషీ అనే సినిమాతో మరో సారి జోడి కట్టారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ చాలా బాగుంది ..ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ జంట అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైన విడాకుల తరువాత సమంత లో చాలా ఛేంజ్ వచ్చింది .. బోల్డ్ గా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో కొత్త ప్రకంపనులు సృష్టిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news