MoviesRC15 లో చరణ్ లుక్స్..శంకర్ ఆ హీరోని కాపీ కొట్టాడా..ఏదో తేడాకొడుతుందే....?

RC15 లో చరణ్ లుక్స్..శంకర్ ఆ హీరోని కాపీ కొట్టాడా..ఏదో తేడాకొడుతుందే….?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్..ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో..తెరకెక్కుతున్న ఈ సినిమా కి “అధికారి” అనే తైటిల్ ను పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాక..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండటం ఓ ప్రత్యేకత అయితే..తెలుగు లో డైరెక్ట్ గా తీస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం మరింత స్పెషల్ గా మారింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఆయ‌న బ్యాన‌ర్లో వ‌స్తోన్న 50వ సినిమా కావ‌డం విశేషం. ఈ సినిమా శంక‌ర్ మార్క్ సాలిడ్ మెసేజ్ ఓరియంటెడ్‌గా తెర‌కెక్కుతోంది. స‌మ‌కాలీన రాజ‌కీయ వ్య‌వ‌స్థ గురించి కూడా ప‌లు అంశాల‌ను ద‌ర్శ‌కుడు ట‌చ్ చేస్తూ.. క‌మర్షియ‌ల్ కోణంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సినిమా లో చరణ్..తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, తాజా గా ఈ సినిమా నుండి చరణ్ లుక్ ని షేర్ చేశారు మేకర్స్. రామ్‌చ‌ర‌ణ్ కి మేక‌ప్ చేస్తున్న వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఇందులో చెర్రీ హాఫ్ లుక్ లో మాత్రమే క‌నిపించారు. ఈ లుక్ క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారింది. ముఖ్యంగా గుబురు గ‌డ్డం, క‌ళ్ల‌జోడుతో స‌రికొత్త లుక్‌లో ఆక‌ట్టుకున్నారు. అయితే, ఈ లుక్ అచ్చం కోలీవుడ్ హీరో విజయ్ లా ఉందంటూ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. శంకర్ లాంటి బిగ్ డైరెక్టర్ కూడా ఇలా కాపీ కొటాడా అంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news