Moviesవామ్మో..మీనా భర్త ఆస్తులు అన్ని కోట్లా..?

వామ్మో..మీనా భర్త ఆస్తులు అన్ని కోట్లా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనా..గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన నటనతో ..అందం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బ్యూటి. టాలీవుడ్ బడా స్టార్స్ అయిన .. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్..ఇలా అందరి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో..చేతికి వచ్చిన పాత్రలు చేస్తూ..బిజీ గా ఉంది.

అయితే, సడెన్ ఆమె భర్త విద్యాసాగర్ రెండు రోజుల క్రితమే మృతి చెందాడు. ఈ ఊహించని పరిణామంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కు తోడు… కరోనా కూడా తోడు కావడంతో సమస్య తీవ్రమైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత విషమమై విద్యాసాగర్ కనుమూసినట్టు సమాచారం. అయితే జనవరిలో కరోనా కారణంగా మీనా కుటుంబం మొత్తం కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే విద్యాసాగర్ కు ఈ సమస్య ఇంకా ఎక్కువైనట్టు తెలుస్తోంది.

కాగా, మీనా భర్త మరణించాక సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ గా మారాయి. మీనా కు, ఆమె భర్త కు మధ్య గొడవలు ఉన్నాయని..ఆ కారణంతోనే ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించిందని .. అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మీనా భర్త ఆస్తుల లెక్కలు ఇవే అంటూ ఓ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ అయిన మీనా భర్తకి టోటల్ గా 250కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన 7 దేశాలల్లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్దాయి పోజీషన్ లో ఉన్నారట. మంచి టాలెంటెడ్ అని కూడా సమాచారం. కానీ, ఇలా చిన్న వయసుల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం బాధాకరం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news