Moviesఅలా చేస్తేనే హౌస్ లో ఉంటావు..ఉదయభానుకు బిగ్ బాస్ ఖతర్నాక్ కండీషన్..ఇది...

అలా చేస్తేనే హౌస్ లో ఉంటావు..ఉదయభానుకు బిగ్ బాస్ ఖతర్నాక్ కండీషన్..ఇది అస్సలు గేమ్ అంటే..!?

బిగ్ బాస్..ఈ పేరు చెప్పితే తిట్టు కునే వాళ్ళు కొందరు అయితే. గుర్తుపెట్టుకునే వాళ్లు కొందరు. కొంచెం కష్టంగా కొంచెం ఇష్టం గా ఈ పేరు కొందరి జీవితాల్లో పెను మార్పులు సృష్టించింది. మంచి పేరున్న వారు ఈ షో కి వెళ్ళి ఉన్న పేరుని చెడకొట్టుకుని వస్తే.. ఊరు పేరు తెలియని వారు కూడా ఈ షోకి వెళ్ళి టాప్ సెలబ్రిటీలు గా ఇప్పుడు యూట్యూబ్ ని ఏలేస్తున్నారు. బడా బడా డైరెక్టర్స్ తో ఇంటర్వ్యులు, పార్టీలు తీసుకుంటున్నారు. సో, బిగ్ బాస్ పూర్తిగా బ్యాడ్ గేమ్ షో అని చెప్పలేం..అలా అని ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకుని చూసే షో అని కూడా చెప్పలేం.. అది ఓ రియాలిటీ షో..కానీ రియాలిటీ గా మాత్రం ఉండదు అది అంతే.

అయితే, ఇప్పటికే బిగ్ బాస్ ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ కూడా ఓ సీజన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కి టైం దగ్గరపడ్దింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసారు బిగ్ బాస్ మెనేజ్ మెంట్. . ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈసారి కూడా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్న వారిని అలాగే యాంకర్లను బుల్లితెర నటీనటులను ఈ కార్యక్రమంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సీజన్ 6 లో అలరించడాని హాట్ ఐటెం బాంబ్ లాంటి అమ్మాయిలతో పాటు.. స్టార్ యాంకర్ ఉదయభాను లాంటి వాళ్ళను కూడా సెలక్ట్ చేసారట.

అయితే, బిగ్ బాస్ షో జరిగేది అంత అబద్ధం..అది అంతా డ్రామా అని చాలా మంది అంటారు. మరి అలాంటి షో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే మాట్లాడే ఉదయభాను సెట్ అవ్వగలదా అనేడౌట్లు ఉన్నాయి. అయితే, ఈ యాంకరమ్మ కి బిగ్ బాస్ ఆఫర్ ఫిక్స్ అయ్యింది మాత్రం కన్ ఫామ్ అని పక్క సమాచారం అందుతుంది. అయితే, బిగ్ బాస్ క్రేజీ కండీషన్ మీద అమ్మడుని హౌస్ లోపలికి పంపించడానికి అగ్రిమెంట్ రాసుకున్నారట.

డబ్బుల కోసం హౌస్ ఉండాలి అని లేనిపోని త్యాగాలు చేయకూడదు..”నువ్వు నీలా..బయట ఎలా ఉంటావో..అలానే హౌస్ లోపల కూడా ఫేస్ మీదనే మాట్లాడాలి..కంటెంట్ క్రియేట్ చేయాలి..కాంప్రమైజ్ కాకుదడు దేంట్లో..”అన్నట్లు మాట్లాడుకుని కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసారట.ఇక ఉద‌యభాను యాంక‌ర్‌గానే కాక సినిమాల్లోనూ న‌టించి అల‌రించింది. ఈమె రానా హీరోగా వ‌చ్చిన లీడ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌రా.. అంటూ ప్ర‌త్యేక పాట‌లోనూ నర్తించి ఆక‌ట్టుకుంది. అయితే ఈమె బిగ్ బాస్‌లో పాల్గొంటే క‌చ్చితంగా రేటింగ్స్ వ‌స్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే ఈమె కోసం నిర్వాహ‌కులు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news