Movies"ఆ హీరోయిన్ నాకు సైట్ కొడుతుంది"..ఓపెన్ గా చెప్పేసిన విజయ్ దేవరకొండ..!!

“ఆ హీరోయిన్ నాకు సైట్ కొడుతుంది”..ఓపెన్ గా చెప్పేసిన విజయ్ దేవరకొండ..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక్కటే పేరు వినిపిస్తుంది. అదే విజయ్ దేవరకొండ. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ..ఇప్పుడు బాలీవుడ్ లో మోసట్ క్రేజీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరో గురించి ఎంత చెప్పిన తక్కువే గానే కనిపిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు..బాలీవుడ్ లో కూడా యూత్ ఈ హీరోకి పిచ్చ అభిమానులుగా మారిపోయారు. ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు అంటే ఈ మధ్యనే ఓ అమ్మాయి తన వీపు పై విజయ్ ఫేస్ ను పచ్చ బొట్టు వేయించుకుంది. దీని బట్టి చెప్పచ్చు ఈయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో..

ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చేసినా విజయ్‌ దేవరకొండ డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో..లైగర్ అనే సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో..మళ్లీ ఆయన డైరెక్షన్ లోనే మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు. ఇక ఇవే కాకుండా పలు సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న ఈయన .. యాడ్ లు కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్ గా వెళ్లిన ఈయన కరణ్ అడిగిన బోల్డ్ ప్రశ్నలకు డబుల్ బోల్డ్ ఆన్సర్స్ ఇచ్చి మైండ్ బ్లాక్ చేసాడు. కాగా రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే సరదాగా ఈ ఫన్నీ వీడియో చేశాడు. అది డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. అందులో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యతో రౌడీ హీరో విజయ్ తెలుగులో మాట్లాడుతూ… ..చూడు అనన్య, నువ్వు చాలా అందంగా ఉన్నావ్..క్యూట్ పిల్లవి నువ్వు.. కానీ, నన్ను ఉరికే ఇలా పడేయాలని చూడకు.. నాకు లైన్‌ వేయకు.. వద్దు..ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్‌ చేస్తున్న టైంలో.. ఆమెకు తెలుగు రాక..విజయ్ ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాక ..‘వావ్‌.. చాలా బాగుంది. మళ్లీ ఒంకోసారి చెప్పవా..ప్లీజ్” అంటూ కోరగా..అప్పుడే మ్యాటర్ లోకి వచ్చిన కరణ్‌ హిందీలో.. ‘అతను నువ్వు క్యూట్ గా ఉన్నావ్ అని చెబుతున్నాడు. కానీ , తనని ఫ్లర్ట్ చేయకు అంటున్నాడు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అనన్య బుంగ మూతి పెట్టుతుంది. ఈ వీడియో నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news