Moviesనమ్రతకు, మేజర్ హీరోయిన్ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

నమ్రతకు, మేజర్ హీరోయిన్ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

వర్సటైల్ స్టార్ అడివి శేష్ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల ముందు రిలీజ్ అయ్యింది. జనరల్ గా సినిమా అంటే ప్లస్ లు మైఅనస్ లు ఉంటాయి. సినిమా చూశాక జనాలు వాళ్లకి నచ్చిన విధంగా కొందరు పాజిటీవ్ గా, మరికొందరు నెగిటీవ్ గా రివ్యూ ఇస్తుంటారు.

కానీ, మేజర్ సినిమా విషయంలో ఒక్కరు అంటే ఒక్కరు కూడా చిన్న నెగిటివ్ రిమార్క్ కూడా ఇవ్వలేదు. ధియేటర్స్ కి వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు..సూపర్..ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది అంటూ చెప్పుతున్నారు. మరికొందరు..బాగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లతో ధియేటర్ బయటకి వస్తున్నారు తప్పిస్తే..ఎవ్వరు కూడా చెడుగా చెప్పడంలేదు. చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్ శశి కిరణ్ తిక్క. సినిమాలో మొత్తానికి హీరో అడవి శేష్ బ్యాక్ బోన్ గా నిలిచాడు.

శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. కాగా, ఈ సినిమాలో స్టార్ డాటర్ సయీ మంజ్రేకర్‌. ఈమె దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు అన్న సంగతి తెలిసిందే. దబాంగ్‌3 చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె గని సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. నిజానికి మొదట ఆమె సైన్ చేసిన తెలుగు సినిమా మేజర్ నే.

కానీ, కొన్ని కారణాల చేత మేజర్ సినిమా షూటింగ్ వాయిదా పడ్డింది. ఈ క్రమంలోనే ఆమె వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వచ్చిన గని సినిమా లో నటించింది ..షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ అయ్యింది. అయితే, మేజర్ సినిమా టైంకి అమ్మడు అంటే తెలుగులో ఎవ్వరికి తెలియదు. కానీ, మహేశ్ బాబు భార్య నమ్రత కి మాత్రం సినిమా స్టోరీ వినగానే..సయీ మంజ్రేకర్‌ నే గుర్తు వచ్చిందట.

ఫేస్ లో ఆ అమాయకత్వం ..భర్త పై ప్రేమ..ఓ భార్య భర్త నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తుంది.. మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి..మనకన్నా తన ప్రోఫిషన్ ని ఎక్కువ గా ఇష్టపడితే ..ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో..కళ్ళతోనే చెప్పే అమ్మాయి కావాలని..నమ్రత పట్టుబట్టి సయీ మంజ్రేకర్‌ నే హీరోయిన్ గా సెలక్ట్ చేసిందట. అలా తన తెలుగు కెరీర్ లో ఫస్ట్ హిట్ ఇచ్చింది నమ్రత.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news