Moviesఅసలైన హీరోయిన్ ఎవరు..బట్టలు విప్పి చూపిస్తున్న బ్యూటీలా..? హీరో చేత గొడుగు...

అసలైన హీరోయిన్ ఎవరు..బట్టలు విప్పి చూపిస్తున్న బ్యూటీలా..? హీరో చేత గొడుగు పట్టించుకున్న సాయిపల్లవినా..?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న హాట్ టాపిక్ గా నిలిచింది. ఇండస్ట్రీ కళ్లు అన్ని సాయి పల్లవి పైనే ఉన్నాయి. మనకు తెలిసిందే, నేటి కాలం హీరోయిన్లు ఎలా ఉన్నారో. రెమ్యూనరేషన్ పెంచాలే కానీ, ఉన్న జానడు గుడ్డముక్కను కూడా తీసేసే నటీమణులు ఉన్నారు. వల్గర్ ఫోటో షూట్ లు చేస్తూ..అవి నెట్టింట పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మనం ఇప్పటి వరకు అలాంటి హీరోయిన్స్ ని చాలా మందినే చూశాం.

కానీ, సాయి పల్లవి స్టైల్ వేరు. ఓ హీరోయిన్ గానే కాదు..ఓ అమ్మాయిగా కూడా చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలబడుతుంది . గ్లామర్ అన్న పదానికి దూరంగా..నటన అన్న పదానికి దగ్గర ఉండే రోల్స్ చూస్ చేసుకుంటూ..ఇండస్ట్రీలో నిజమైన్ హీరోయిన్ గా ఫ్యాన్స్ ను సంపాదించుకుంటుంది. ఇప్పటి వరకు సాయి పల్లవి ఎక్స్ పోజింగ్ చేయలేదు..ఇక పై కూడా చేయదు..అంత మొండి పిల్ల. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సాయి పల్లవి..రీసెంట్ గా కర్నూలులో తాను హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం..”విరాటపర్వం” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి వచ్చింది.

అంతా బాగానే ఉన్నా సడెన్ గా గాలి, వర్షం మొదలైంది. అయినా కానీ, స్టేజి పై నుంచి సాయి పల్లవి కదలలేదు. అదే ఆ టైంలో వేరే హీరోయిన్ ఎవ్వరు ఉన్నా..కానీ, వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ కార్ లోకి వెళ్లిపోవడానికి ట్రై చేసేది. మెకప్ పోతాది అన్ని కావచ్చు..లేక మరే ఇతర కారణాల చేత నైన ..మిగతా హీరోయిన్స్ వెళ్లిపోయి ఉండేవారు . కానీ సాయి పల్లవి, తనని అభిమానించే అభిమానుల కోసం..అక్కడే నిల్చుంది. బోరున గాలీ వీస్తున్న చీర కొంగు, జుట్టు ఆమెను ఇబ్బంది పెడుతున్నా కానీ, ఆమె స్టేజీ పై అలా నే నిల్చుని మాట్లాడింది .

తన పై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడుతూనే ఉంది. సడెన్ గా వర్షం పెద్దదైంది..అయినా సాయి పల్లవి స్పీచ్ ఆపలేదు..అక్కడ నుండి కదల లేదు..దీంతో పక్కన ఉన్న రానా నే ఆమె తడవకుండా..గొడుగు పట్టాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ అరుపులు కేకలు…అభిమానుల ఆనందానికి అవధులు లేవు. నిజానికి ఇది రానా గొప్పతనం కూడా..మిగతా హీరోలు అక్కడ ఉన్న ఇలా చేస్తారని చెప్పలేం.

కానీ రానా ఆ మగ అహంకారానికి పోలేదు. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ రానా ని పొగిడేస్తున్నారు అంతేనా..ఇప్పుడు చెప్పండి..నిజమైన హీరోయిన్ ఎవరు అంటూ పల్లవి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వేరే ఆర్టిస్టులంతా మరోసారి సాయి పల్లవి క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు. విరాటపర్వం సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news