Moviesఆ పేపర్స్ పై బలవంతంగా చైతన్య తో సంతకం చేయించిన సమంత..తెర...

ఆ పేపర్స్ పై బలవంతంగా చైతన్య తో సంతకం చేయించిన సమంత..తెర పైకి సంచలన మ్యాటర్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళు కలిసి సినిమాలో నటించే టైంలోనే..ఒకరిని ఒకరు ఇష్టపడ్డారట. ఆ విషయంలో ఇంట్లో చెప్పకుండా..కొన్నాళ్లు వెయిట్ చేసి..కెరీర్ లో సెటిల్ అయ్యాక చెప్పుదాం అని అనుకున్నారు. కానీ, ఈలోపే నాగార్జున చైతన్య కి సంబంధాలు చూడటం..ఓ స్టార్ హీరో కూతురితో పెళ్ళి అనుకోవడంతో..అస్సలు మ్యాటర్ బయట పెట్టేశాడు..చైతన్య.

 

ఇక వాళ్ల ఇష్ట ప్రకారమే ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకుని పెళ్ళి చేసారు. కానీ, ఇన్ సైడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం..సమంత తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదట. దానికి కారణం..అప్పటికే ఆగిపోయిన అఖిల్ నిశ్చితార్ధం..పైగా తండ్రి రెండో పెళ్ళి..మనకు వద్దు ఇలాంటి వాళ్ళతో సంబంధం అని గట్టిగానే చెప్పారట. కనీ, సమంత మొండిగా ..వాళ్ళను ఒప్పించి ఫైనల్లీ పెళ్లి చేసుకుంది.

కొన్నాళ్ళు బాగానే సాగిన వీర సంసారంలో ఏవో కొన్ని సమస్యలు వచ్చాయి. దానికారణంగా వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. అయితే, విడాకులు తీసుకోకముందు..చైతన్య సినిమాకి సంబంధించిన మ్యాటర్స్ అన్ని..సమంతనే దగ్గరుండి చూసుకునేదట. ఆ క్రమంలోనే “దూత ” వెబ్ సిరీస్ కధను ముందు వినిపింది సమంతనేనట. ఆమె బాగా నచ్చేయడంతో చై కి చెప్పిందట.

కానీ, నెగిటీవ్ షేడ్స్ పాత్ర వద్దు అనుకుని చై ఈ కధను రిజెక్ట్ చేయాలి అనుకుంటున్న తరుణంలో సమంత ..చై దగ్గర బలవంతంగా ఆ వెబ్ సిరీస్ అగ్రిమెంట్ పై సైన్ చేయించిందట. ఓ నటుడి గా ఎదగాలి అంటే అన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలు చెయ్యాలి అనేది ఆమె అభిప్రాయం. అలా చై కి ఇష్టం లేకున్నా సైన్ చేయించిందట. విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరు వాళ్ల వాళ్ళ పనుల్లో బిజీగా మారిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news