Moviesనందమూరి వారసుడా మజాకా..నాలుగేళ్లకే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ కొడుకు...

నందమూరి వారసుడా మజాకా..నాలుగేళ్లకే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ కొడుకు ..!!

వావ్.. నందమూరి వారసుడా మజాకా..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ ని చూసి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో NTR కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్..చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా వీలు చిక్కినప్పుడు కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. తన పిల్లలకు సంబంధించిన తీపి గుర్తులను అభిమానులతో షేర్ చేయడం ఎన్టీఆర్‌కు అలవాటు దీంతో వీళ్ల కి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గానే మారుతుంటాయి.

అయితే, నేడు అనగ జూన్ 14 ..తారక్ చిన్న కొడుకు పుట్టిన రోజు. హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. వాళ్ల వారసులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పైగా అభిమానులు వారసుల పుట్టిన రోజులను కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

2018 జూన్ 14 న తారక్-ప్రణతిలకు రెండవ సంతానంగా జన్మించాడు భార్గవ్ రామ్. భార్గవ్ చూడటానికి అచ్చం వాళ్ళ నాన్న లానే ఉంటారు. ఆ స్మైల్, కళ్లల్లో ఆ స్పార్క్..ఫేస్ లో తెలియని అట్రాక్షన్..చూడగానే ఆకట్టుకునేలా ఉంటాడు. దీంతో ఈ స్టార్ కిడ్ సినిమాలోకి వస్తే ఖచ్చితంగా నాన్న ని మించిన నటుడు అయిపోతాడు అంటుంటారు నందమూరి ఫ్యాన్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే సంధర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్గవ్ రామ్ అరుదైన ఫొటోలు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో వైరల్ అవుతున్నాయి. నిజానికి తారక్ బర్త డే రోజు కూడా ఇంత హడావుడి మనం చూడలేదు.

 

కానీ, భార్గవ్ బర్త డే సందడి మామూలుగా లేదు. నాలుగో సంవత్సరంలో కి అడుగు పెడుతున్న ఈ నందమూరి స్టార్ కిడ్ భార్గవ్ రామ్..అప్పుడే నాన్నకి మించిన క్రేజ్ సంపాదించునేశాడు. భార్గవ్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ సెలబ్స్ సోషల్ మీడియాలో వేదికగా NTR కొడుకుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో Happy Birthday Bhargav Ram హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news