Moviesన‌య‌న్ - విఘ్నేష్ హ‌నీమూన్ ట్రిప్‌... ఖర్చు ఎంతో తెలిస్తే క‌ళ్లు...

న‌య‌న్ – విఘ్నేష్ హ‌నీమూన్ ట్రిప్‌… ఖర్చు ఎంతో తెలిస్తే క‌ళ్లు చెదిరాల్సిందే..!

హ‌మ్మ‌య్యా ఎట్ట‌కేల‌కు గ‌త నాలుగేళ్లుగా ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న జంట న‌య‌న‌తార – విఘ్నేష్ శివ‌న్ పెళ్లి ఎట్ట‌కేల‌కు అయ్యింది. ఈ నెల 9న చెన్నై స‌మీపంలోని మ‌హాబ‌లిపురంలో ఈ జంట అంగ‌రంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పెళ్లైన మ‌రుస‌టి రోజే ఈ కొత్త జంట త‌మ ఇష్ట దైవం అయిన తిరుమ‌ల శ్రీవారిని సంద‌ర్శించుకున్నారు. అయితే అక్క‌డ ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లోని మూడ‌వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగారు.

అయితే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని న‌య‌న్ – విఘ్నేష్ దంప‌తులు అది కావాల‌ని చేసిన త‌ప్పుకాద‌ని.. పొర‌పాటుగా జ‌రిగింది అంటూ ఓ లెట‌ర్ విడుద‌ల చేశారు. స్వామి వారంటే తమ కుటుంబానికి ఎంతో భ‌క్తి అని విఘ్నేష్ చెప్పాడు. ఆ త‌ర్వాత త‌మ పెళ్లి అంద‌రికి గుర్తుండిపోయే రేంజ్‌లో ల‌క్ష మందికి భోజ‌నాలు కూడా పెట్టారు. ఇక ఇప్పుడు ఈ సెల‌బ్రిటీ జంట హానీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

హానీమూన్ ట్రిప్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంది. థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాంక్ చేరుకున్న న‌య‌న్ దంప‌తులు అక్క‌డ ల‌గ్జ‌రీ హోట‌ల్లో ఉన్నార‌ట‌. పెళ్ల‌యిన త‌ర్వాత ఫ‌స్ట్ టూర్ కావ‌డంతో ఈ టూర్‌లో వాళ్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. హ‌నీమూన్ ట్రిప్‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను సైతం విఘ్నేష్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ ట్రిప్ కోసం న‌య‌న్ ఏకంగా రు. 2 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ట‌. ల‌గ్జ‌రీ హోటల్స్‌తో పాటు అక్క‌డ బీచ్‌ల్లో ఎంజాయ్‌మెంట్లు, ఖ‌రీదైన రెస్టారెంట్ల‌లో భోజ‌నాలు.. ఓవ‌రాల్‌గా ఈ ట్రిప్ కోసం న‌య‌న్ భారీగానే ఖ‌ర్చు చేస్తోంది. న‌య‌న్ – విఘ్నేష్ హానీమూన్ ట్రిప్ ఇప్పుడు కోలీవుడ్ మీడియా స‌ర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్ కావ‌డంతో పాటు బాగా ట్రెండ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news