Moviesఆ యంగ్ హీరోయిన్‌తో నాగ‌చైత‌న్య డేటింగ్‌... సీక్రెట్ ప్రేమాయ‌ణం వెన‌క క‌థ...

ఆ యంగ్ హీరోయిన్‌తో నాగ‌చైత‌న్య డేటింగ్‌… సీక్రెట్ ప్రేమాయ‌ణం వెన‌క క‌థ ఇదే..!

స‌మంత‌తో విడాకుల త‌ర్వాత నాగ‌చైత‌న్య త‌న సినిమాలు ఏవో తాను చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. విడాకుల టైంలోనే ల‌వ్‌స్టోరీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టిన చైతు..సంక్రాంతికి నాన్న‌తో క‌లిసి బంగార్రాజుగా వచ్చి ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పించాడు. ప్ర‌స్తుతం థ్యాంక్యుతో పాటు బాలీవుడ్‌లోకి అమీర్‌ఖాన్ ప‌క్క‌న న‌టిస్తోన్న లాల్‌చ‌ద్దా సినిమాతో న‌టిస్తూ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల‌పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి.

చైతు కెరీర్‌పైనే ఫుల్‌గా ఫోక‌స్ పెట్టిన‌ప్ప‌ట‌కీ ఏదో ఒక‌లా వార్త‌ల్లో అయితే ఉంటున్నాడు. మొన్నామ‌ధ్య వ‌ర‌కు సాయిప‌ల్ల‌వితో ప్రేమ‌లో ఉన్నాడ‌న్న పుకారు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో యంగ్ హీరోయిన్‌తో చైతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని.. ఆమెతో సీక్రెట్‌గా ఎఫైర్ కూడా కొన‌సాగిస్తున్నాడ‌ని.. ఆమెనే త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ యంగ్ హీరోయిన్ ఎవ‌రో కాదు శోభిత ధూళిపాళ‌. చైతు ఇప్పుడు ఆమెతోనే ఎక్కువుగా క‌లిసి ఉంటున్నాడ‌ని.. వారిద్ద‌రు హైద‌రాబాద్‌లో చెట్టాప‌ట్టాలేసుకుని మ‌రీ తిరుగుతున్నార‌ని కూడా అంటున్నారు. చెన్నై, బెంగ‌ళూరుకు కూడా ఈ జంట సీక్రెట్‌గా ట్రిప్పులు వేస్తోంద‌ట‌. స‌మంత‌తో విడాకుల త‌ర్వాత చైతు జూబ్లిహిల్స్‌లోని త‌న కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఆ ఇంట్లో అప్పుడ‌ప్పుడు శోభిత కూడా చైతుతో క‌లిసి చాలా మందికి కనిపిస్తోంద‌ట‌. వారిద్ద‌రు అక్క‌డ కొద్దిసేపు గ‌డిపిన త‌ర్వాత తిరిగి వెళ్లుతున్నార‌ని ఇప్పుడు ఫిల్మ్‌న‌గ‌ర్లో ఒక్క‌టే కోడై కూస్తున్నారు. ఇక హైద‌రాబాద్‌లో శోభిత – చైతు క‌లిసి ఒకే కారులో చ‌క్కెర్లు కూడా కొడుతున్నార‌ట‌. ఇటీవ‌ల మేజ‌ర్ సినిమా షూటింగ్ ఎక్క‌డ జ‌రుగుతున్నా కూడా శోభిత‌ను క‌లిసేందుకు నాగ‌చైత‌న్య షూటింగ్ స్పాట్‌కు చాలా సార్లు రావ‌డం కూడా వీరిద్ద‌రి మ‌ధ్య బ‌ల‌ప‌డిన బంధం గురించి చెప్ప‌క‌నే చెపుతోంద‌ని అంటున్నారు.

అంత‌కు ముందే సాయిప‌ల్ల‌వి – చైతు గురించి ర‌కర‌కాల వార్త‌లు వ‌చ్చినా వారిద్ద‌రు క‌లిసింది లేదు.. తిరిగింది లేదు. అయితే ఇప్పుడు శోభిత – చైతు ఎక్క‌డిక‌క్క‌డ క‌లిసి క‌నిపిస్తుండ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ నిజ‌మే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news