Moviesకళ్లు నెత్తికెక్కాయా..టాలీవుడ్ హీరోల విషయంలో బాలయ్య అభిమానులు హర్ట్..?

కళ్లు నెత్తికెక్కాయా..టాలీవుడ్ హీరోల విషయంలో బాలయ్య అభిమానులు హర్ట్..?

యస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. నందమూరి అభిమానులని తీవ్రంగా హర్ట్ చేసింది. సినీ ఇండస్ట్రీ అంటే ఓ కళాశాల..ఇక్కడ ఉన్న హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫ్రెండ్స్..కలిసి కట్టుగా ఉంటాం అని మాటలు చెప్పుతుంటారు. అవి పై పైకే అని అర్ధమైపోయింది. సినీ ఇండస్ట్రీలో చెప్పేది ఒక్కటి చేసేది మరోకటి అని అంటూ ఫ్యాన్స్ మిగతా హీరోల పై మండి పడుతున్నారు.

జూన్ 10 బాలయ్య పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. జనరల్ గా ఏ అభిమాని కైనా..తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటేనే అది ఓ పెద్ద పండగ రోజు. అలాంటి బాలయ్య లాంటి లెజండ్ బర్త డే అంటే..ఇక చెప్పనవసరం లేదు. నందమూరి అభిమానులంతా కలిసి పండగ చేసుకుంటారు. రీసెంట్ గా ఆయన 62వ పుట్టినరోజును జరుపుకున్నారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు హ్యాపి బర్త డే అంటూ విషెస్ చెప్పారు.

అయితే, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఎవ్వరు కూడా బాలయ్య కు బర్తడే విషెస్ అందించలేదు. మేం బాలయ్య ఫ్యాన్స్ అంటూ చెప్పుకుని..వాళ్ల సినిమాలో బాలయ్య క్రేజ్ ను వాడుకునే కొందరు యంగ్ హీరోలు కూడా..విష్ చేయకపోవడం గమనార్హం. దీంతో బాలయ్య అభిమానులు బాగా హర్ట్ అయారు.

“కళ్లు నెత్తికెక్కాయా వాళ్లకి” అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు . తమ అభిమాన హీరోకు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని వారందరూ ఇతర హీరోలపై కోపంతో ఊగిపోతున్నారు. ఏది ఏమైనా..అంత పెద్ద స్టార్ హీరో కి విష్ చేయక పోవడం నిజంగా తప్పే అంటున్నారు సినీ విశ్లేషకులు కూడా..మరి చూడాలి దీని పై ఆ హీరోలు ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news