Moviesనయనతార పై శాపనార్ధాలు..సర్వ నాశనం అయిపోతుందంటూ సంచలన కామెంట్స్...?

నయనతార పై శాపనార్ధాలు..సర్వ నాశనం అయిపోతుందంటూ సంచలన కామెంట్స్…?

నయన తార..ఏం చేసినా అది హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది నెట్టింట. సినిమాలో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ..తన సినిమాలతో స్టార్ హీరోయిన్లకి కూడా దడ పుట్టిస్తుంది. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి..నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకున్న ఈ బ్యూటీ..ప్రజేంట్ తెలుగు, తమిళ,మలయాళంలో నెం 1 హీరోయిన్ గా కొనసాగుతుంది. నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైన లీనమైపోయి నటించే ఈ అమ్మడు..పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయిపోయింది.

గత ఆరెళ్లు గా నయన్..ప్రాణంకన్న ఎక్కువుగా ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రెస్టారెంట్ లో చాలా సింపుల్ గా ..కుటుంబసభ్యులు..దగ్గర స్నేహితుల మధ్య విగ్నేశ్ చేత మూడు మూళ్లు వేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, నయన్ పెళ్లి చేసుకున్న ఈ మూమెంట్ లో కొందరు ఆకతాయిలు ఆమె గత బాయ్ ఫ్రెండ్స్ తాలుకా ఫోటోలను నెట్టింట మళ్లీ వైరల్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే గతంలో నయన్..హీరో శింబు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ తో లవ్ ఎఫైర్ నడిపిన సంగతి. ఆ టైంలో శింబుతో నయన్ గడిపిన క్షణాల ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచాయి. ప్రభుదేవా తో కూడా పెళ్లి వరకు వెళ్ళిన నయన్..ఆ తరువాత ఎందుకో వీళ్లు విడిపోయారు. అయితే నయన్ తో పెళ్లి కోసం ప్రభుదేవా.. భార్య కు విడాకులు కూడా ఇచ్చేశాడు.

ఆ టైంలో నయన్ పై ప్రభుదేవా భార్య ఫుల్ ఫైర్ అయ్యింది. ఆమె ను తిడుతూ శాపనార్ధాలు పెట్టింది. ఆమె ఊసురు నయన్ కి ఖచ్చితంగా తగులుతుందని..సర్వ నాశనం అయిపోతుందని..గతంలో ఆమె చేసిన కామెంట్స్ ని ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఏమైనా..శుభమా అని ఆమె పెళ్లి చేసుకున్న టైంలో ఇలాంటి వీడియో లు వైరల్ అవ్వడం…నయన్ అభిమానులను హర్ట్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news