Moviesవరుసగా మూడు సినిమాలు..జాక్ పాట్ కొట్టిన కృతి శెట్టి..?

వరుసగా మూడు సినిమాలు..జాక్ పాట్ కొట్టిన కృతి శెట్టి..?

టాలీవుడ్ లేటేస్ట్ యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుంది. అంతేనా..ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలల్లో కూడా మంచిగా నటించి..బాక్స్ ఆఫిస్ వద్ద హ్యాట్రిక్ కొట్టింది. దీంతో అమ్మడుని వదలటం లేదు మన డైరెక్టర్లు. కేవలం టాలీవుడ్ లోనే కాదు..కోలీవుడ్ లో అమ్మడు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే బాల డైరెక్షన్ లో సూర్య హీరో గా రాబోతున్న చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయిన కృతి..ఇప్పుడు మరో బిగ్ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం కొట్టేసిన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ తదుపరి సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది కృతి అన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన తన లక్కి డైరెక్టర్ తో కలిసి మరో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారట.

ఈ క్రమంలోనే..తమ సినిమాలో యంగ్ హీరోయిన్ కృతికి అవకాశం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కృతి ఇప్పటికే తెలుగులో మూడు సినిమాలకి కమిట్ అయ్యి ఉంది..తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది..ఈ ఆఫర్ మాట నిజమైతే కృతి కోలీవుడ్ లో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే కృతి తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్టిక్ హీరో రామ్‌ పొతినేని సరసన ది వారియర్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news